• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాశిక‌న్నా వాసికే...

రాశిక‌న్నా వాసికే ప్రాధాన్యం.. జన‌సేన ప‌క్కాలెక్క‌.. !

| జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న వ్యూహం పార్టీకి మంచి ఫలితాలను ఇస్తోంది. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం కంటే గెలిచే అవకాశాలున్న స్థానాలకే ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి అన్నింటినీ గెలుచుకున్న జనసేన.. తాజా స్థానిక ఎన్నికల్లోనూ 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. సంఖ్య కంటే గెలుపుకే ప్రాధాన్యం ఇవ్వాలన్న పవన్ లెక్క ఫలిస్తోంది.

By - Garuda Media
Update: 2026-11-07 04:01 GMT

`ఎన్ని స్థానాల్లో పోటీ చేశామన్నది పక్కన పెడితే పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలుపు గుర్రం ఎక్కాలి` అనేది జనసేన పెట్టుకున్న ప్రధాన లక్ష్యం అన్న విషయం ప్రతిసారి స్పష్టం అవుతూనే ఉంది. 2019 ఎన్నికల్లో తొలిసారి రంగంలోకి దిగిన జనసేన రాష్ట్రవ్యాప్తంగా 148 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. అప్పట్లో కూటమికి దూరంగా ఉండి వామపక్షాలు అదేవిధంగా బీఎస్పీ వంటి పార్టీలతో చేతులు కలిపి ఎన్నికలకు వెళ్ళింది. ఆ తర్వాత 2024 కి ముందు టీడీపీతో మళ్ళీ చేతులు కలిపి బీజేపీని చెంతకు చేర్చుకుని ఎన్నికలకు వెళ్ళింది.

ఈ క్రమంలో వేసిన అతిపెద్ద ప్రణాళిక రాశి కన్నా వాసికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే!. ఇది జనసేన కి బాగా కలిసి వచ్చిన పరిణామం. ఎందుకంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేసాం.. అన్నదానికన్నా కూడా పోటీ చేసిన నాలుగైదు స్థానాల్లో అయినా గెలిచాం అన్నది రాజకీయాల్లో అత్యంత కీలకమైన అంశం. దీనిని చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. చాలా తక్కువ మంది మాత్రమే అనుసరించగలరు కూడా. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంత ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ తీసుకున్న నిర్ణయంలో పక్కా గా ఆయన నిలబడ్డారని చెప్పాలి.

2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలే తీసుకున్నారు. ఆ సమయంలో భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. భారీగా వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. సొంత పార్టీలోనే కొందరు నాయకులు విభేదించారు. అయినా ఎక్కడ వెనక్కి తగ్గకుండా అదే పంథాను ముందుకు కొనసాగించారు. ఇది జనసేనకు బాగా కలిసి వచ్చింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించేలా చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఎన్నికలు స్థానిక సంస్థలు అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు.

ఇక్కడ కూడా మళ్లీ 2024 లో వచ్చిన విమర్శలు వచ్చాయి. అప్పటి డిమాండ్లే మరోసారి తెర‌ మీదకి వచ్చాయి. సంఖ్య ఎక్కువగా ఉండాలని పోటీ చేసే నాయకత్వం పెరిగిందని పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వినిపించాయి. అయినప్పటికీ జనసేన అధినేత ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి వ్యవహరించారు. ఫలితంగా ఆది నుంచి ఉన్న అనేక డిమాండ్లు పక్కకి వెళ్లిపోయి.. సంఖ్యాపరంగా కంటే కూడా గెలిచే నాయకులకు మాత్రమే అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో జనసేన వేసిన అడుగులు పక్కా లెక్కలను సరి చేసినట్టుగా మారింది.

తాజా ఎన్నికల్లో స్థానికంగా 100% సాధించడంతోపాటు జనాల్లోనూ మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇలా ఒక కీల‌క అభిప్రాయం ఏర్పడితే పార్టీలకు తిరుగు ఉండదనేది అందరికీ తెలిసిన విషయం. భారీ సంఖ్యలో పోటీ చేసి సగం సీట్లలో గెలిచి.. మిగిలిన సగం సీట్లలో ఓడిపోతే ఆ ప్రభావం జనాల్లో కనిపిస్తుంది. నాయకుల ఓటమి పక్కన పెడితే పార్టీ పైన బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. పుష్కరకాలం తర్వాత పార్టీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే మరింత ఇబ్బందికర పరిణామాలు తప్పవు.

అందుకే కాస్త వెనక్కి అడుగులు వేసినప్పటికీ.. 100% స్ట్రైక్ రేట్ తో పాటు రాశి కన్నా వాసికే ప్రాధాన్యం ఇవ్వాలన్న జనసేన లక్ష్యం అయితే నెరవేరిందనే చెప్పాలి. ఇది కొనసాగుతూ పోతే ముందు ముందు నెమ్మది నెమ్మదిగా సీట్ల సంఖ్యను కూడా పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా పూర్తిస్థాయిలో గెలుస్తారు. నాయకత్వంపై నమ్మకం కూడా పెరుగుతుందనడంలో సందేహం లేదు. జనసేన లెక్క పక్కాగా ఉండడం.. ప్రజల్లోనూ సానుకూలత వ్యక్తం కావడం ఈ సందర్భంగా గమనించాల్సిన కీలక అంశం.

Tags:    
  • janasena 
  • pawankalyan 
  • andhrapolitics 
  • janasenaparty 
  • appolitics 

Similar News

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం జీవితాలను తాకట్టు పెడుతున్నారా?

2026-11-13 19:30 GMT

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

2026-11-13 18:30 GMT

23 ఏళ్లకే రూ.37 వేల కోట్ల సంపద.. ఏఐతో భారత సంతతి యువకుల సంచలనం!

2026-11-13 17:30 GMT

Nvidia CEO రేసులో భారతీయుల పేర్లు.. అసలు పరిస్థితి ఏంటి?

2026-11-13 16:49 GMT

H-1B వీసాదారులకు కొత్త టెన్షన్.. రెన్యూవల్ నిబంధనల్లో మార్పులకు అమెరికా సిద్ధం!

2026-11-13 16:47 GMT

‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి

2026-11-13 16:36 GMT

పంచాయతీలకు బంపర్ ఆఫర్ : ఏకగ్రీవాలలో కొత్త రికార్డు ?

2026-11-13 16:35 GMT

ఒక్కో అశ్లీల ఫొటోకు ఒక్కో యుద్ధ రహస్యం.. పాక్ హనీట్రాప్‌లో చిక్కిన వింగ్ కమాండర్

2026-11-13 16:34 GMT

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్.. సుంకాల విషయంలో కీలక పరిణామం!

2026-11-13 16:30 GMT

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

2026-11-13 14:30 GMT

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.47 లక్షల కోట్లు.. ‘ఎఫైర్’ దెబ్బకు ఎన్వీడియా మటాష్ అంతే..

2026-11-13 13:47 GMT

Copyright @2026

Powered by Blink CMS