చడీ చప్పుడు లేకుండా.. పవన్ కల్యాణ్ తిరుమల టూర్!
అయితే, తాజాగా పవన్ కల్యాణ్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తిరుమలలో ప్రత్యక్ష మ య్యారు. తిరుమల అధికారులకు కూడా ఆయన ఆలయానికి వచ్చే గంట ముందు మాత్రమే సమాచారం అందినట్టు చెబుతున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఎక్కడికి వెళ్లినా అధికారికంగా ముందస్తు ప్రకటన విడుదల చేస్తారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా మీడియాకు ఇస్తారు. ప్రొటోకాల్‌లో భాగంగా డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందిస్తారు. గత నెలలో తెలంగాణలో పర్యటించినప్పుడు.. అదేవిధంగా ఢిల్లీలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడుకూడా మీడియాకు, ప్రజలకు కూడా సమాచారం ఇచ్చారు.
అయితే, తాజాగా పవన్ కల్యాణ్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే తిరుమలలో ప్రత్యక్ష మ య్యారు. తిరుమల అధికారులకు కూడా ఆయన ఆలయానికి వచ్చే గంట ముందు మాత్రమే సమాచారం అందినట్టు చెబుతున్నారు. దీంతో హడావుడిగానే ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం అనూహ్యంగా తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ ధ్వజస్తంభానికి మొక్కుకుని... నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ పర్యటనలో కేవలం ఆయన మాత్రమే ఉన్నారు.
ఇదే రోజు ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ కూడా శ్రీవారిని దర్శించుకోవడం గమనార్హం. అయి తే.. లోకేష్ పర్యటన వివరాలను.. ముందుగానే వెల్లడించినా.. పవన్ కల్యాణ్ టూర్ విషయాన్ని మాత్రం అధికారులు చెప్పకపోవడం గమనార్హం. ఇటీవల తన ఆరోగ్యం బాగోకపోవడంతో మొక్కులు చెల్లించుకు నేందుకు తిరుమలకు వెళ్లి ఉంటారని జనసేన నాయకులు చెబుతున్నారు. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు.
దాదాపు ఏడాది తర్వాత..
దాదాపు ఏదాది తర్వాత పవన్ కల్యాణ్ తిరుమలలో పర్యటించడం గమనార్హం. 2025 ప్రారంభంలో తిరుమల లడ్డూ వివాదం వచ్చినప్పుడు ఆయన సనాతన ధర్మ దీక్ష చేపట్టారు. ఆ సమయంలో దీక్షలోనే తిరుమలకు వెళ్లిన ఆయన.. అక్కడే విరమణ చేశారు. సనాతన ధర్మ దీక్ష పేరుతో తిరుపతిలో సభ కూడా నిర్వహించారు. ఆ తర్వాత.. మళ్లీ ఇప్పుడే తిరుమలలో పనవ్ కల్యాణ్ పర్యటించడం గమనార్హం.