పవన్ కళ్యాణ్ చిరునవ్వుల వెనుక ఉన్న భావం అదేనా..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు వేరు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో పట్టుకోవడం చాలా కష్టం.;

Update: 2025-09-16 11:26 GMT

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు వేరు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో పట్టుకోవడం చాలా కష్టం. సాధారణంగా ఎప్పుడూ నవ్వుతూ కనిపించరు. ఏదైనా సందర్భం వస్తే చిరునవ్వు మాత్రమే కనిపించీ కనిపించకుడా కనిపిస్తుంది. అసలు ఊహించని సమావేశాల్లో భారీ స్పీచ్ ఇచ్చి ఆకట్టుకుంటారు. ఆయన శైలి యంగ్ పొలిటీషియన్స కు భిన్నంగా ఉంటుంది. ఏ కార్యక్రమమైనా చాలా వరకు మౌనంగా ఉంటారు. ఒక వేళ తప్పదనుకుంటే ఆ కార్యక్రమం గురించి మాత్రమే కొంచె మాట్లాడి వెళ్లిపోతారు.

క్వాటం వ్యాలీ సదస్సులో పవన్ కళ్యాణ్..

క్వాంటం వ్యాలీ నిర్మాణంపై కలెక్టర్లతో నిర్వహించిన సదస్సు రెండో రోజు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారం మొదటి రోజే పాల్గొనాలి.. కానీ వీలుపడలేదు. రెండో రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ మంత్రిత్వంలో ఉన్న అటవీ, పంచాయతీ రాజ్, శాస్త్రసాంకేతిక అంశాలపై మాట్లాడాలని చంద్రబాబు ఆయనను కోరారు. అందుకే రెండో రోజు ఆయన ఈ సమావేశానికి వచ్చారు. కార్యక్రమం ప్రారంభమై లంచ్ అవర్ వరకు మామూలుగానే ఉన్న పవన్ కళ్యాణ్ బాబు స్పీచ్, కలెక్టర్లు మాట్లాడే తీరును ఆసక్తిగా పరిశీలించారు. ఈ చర్చల్లో పంచాయతీ రాజ్ విషయం వచ్చిన సమయంలో ఆయన చిరునవ్వులు చిందించారు. సమీపంలో కూర్చున్న మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కు ల్యాప్ టాప్ లో పంచాయతీ రాజ్ ప్రగతి చూపిస్తూ ఇద్దరు నవ్వుకున్నారు.

నవ్వులకు కారణం ఇదీ..

ఇంతకీ ఆ ల్యాప్ టాప్ లో ఏముందని అందరికీ ఆసక్తి కలిగింది. అది ప్రగతికి సంబంధించి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉండేది.. ప్రస్తుత టీడీపీ హయాంలో ఎలా ఉంది అంటూ చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు వివరిస్తున్న సమయంలో.. ఆ రోడ్లకు సంబంధించి చిత్రాలను ల్యాప్ టాప్ లో నాదెండ్లకు చూపిస్తూ ఇద్దరు కలిసి కాసేపు నవ్వుకున్నారు. గ్రామీణులు పవన్ కళ్యాణ్ కు బ్రహ్మరథం పడుతున్నారన్న విషయాన్ని సైతం చంద్రబాబు చెప్తుండడంతో కాసేపు మురిసిపోయినట్లు కనిపించింది. మొత్తానికి ఆ నవ్వుల వెనుక ఇంత స్టోరీ ఉందని పవన్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News