ఆ మాట పవన్ కి గుచ్చుకుంటోందా ?

మాట్లాడితే చాలు తనను ఆంధ్రా అని అంటున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

Update: 2026-06-03 00:30 GMT

మాట్లాడితే చాలు తనను ఆంధ్రా అని అంటున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అది నాకు నచ్చడం లేదు అని ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు. తనకు తెలంగాణా మీద ఎంతో ప్రేమ ఉందని దానిని నిరూపించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదని ఆయన అన్నారు తమమి విమర్శించే నాయకులకు అడిగే హక్కు అంతకంటే లేదని అన్నారు. తాను తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని ఏనాడూ వ్యతిరేకించలేదని పవన్ వివరించారు. తెలంగాణాను విభజించిన తీరుని మాత్రమే తప్పు పట్టాను అన్నారు. తెలంగాణా సంస్కృతి అన్నా ఇక్కడ ప్రజలు అంతా తనకు ఇష్టమని చెప్పారు. సామాజిక తెలంగాణాను తాను కోరుకున్నాను అని కూడా పవన్ చెప్పారు.

ప్రజలకు ద్వేషం లేదు :

తెలంగాణా ప్రజలకు ఆంధ్రా వారి మీద ద్వేషం అసలు లేదని పవన్ అన్నారు. అలా కనుక ఉండి ఉంటే ఇన్నేళ్ళ కాలంలో ఆంధ్రా ప్రజలు ఒక్కరు కూడా ఇక్కడ ఉండేవారు కాదని అన్నారు. అలాగే ఏపీ నుంచి పన్నెండేళ్ళ కాలంలో తెలంగాణా నాయకులను ఒక్క మాట కూడా ఎవరూ అనలేదని విమర్శించలేదని పవన్ గుర్తు చేశారు. కానీ ఆంధ్రా వారిని మాత్రం ఎన్నో సార్లు విమర్శించారు అని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రాలో బడుగులు బలహీనులు లేరా పేదలు లేరా వివిధ సామాజిక వర్గాల ప్రజలు లేరా అని ఆయన ప్రశ్నించారు.

అడుగు పెట్టనీయరా :

ఇక తనను ఆంధ్రాలో అడుగు పెట్టనీయమని అంటున్నారు అని పవన్ మండిపడ్డారు. ఎందుకు అడుగు పెట్టనీయరని ఆయన ప్రశ్నించారు. అసలు మీరు అంతా ఎవరు అని ఆయన నిలదీశారు. మీ అయ్య జాగీరా అని కూడా పవన్ ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. తన లాంటి వాడినే అడుగు పెట్టనీయమని బెదిరిస్తే ఇక సామాన్యుల సంగతి ఏమిటి అన్నారు. తెలంగాణా భారత దేశంలో అంతర్భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎంతో మంది పొట్ట కూటి కోసం ఇక్కడికి వస్తున్నారని వారిని తరిమేస్తే ఎలా అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తెలంగాణాలో తిరిగాను :

తాను గతంలో ప్రజా సమస్యల మీద ఎక్కువగా తిరిగింది తెలంగాణాలోనే అని పవన్ గుర్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ లాంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో తాను జనం కోసం తిరిగాను అని ఆయన చెబుతూ ఇప్పుడు తనను విమర్శించే వారు అంతా నాడు తిరిగారా అని ప్రశ్నించారు. మీ సౌకర్యాల నుంచి మీరు ఎపుడూ బయటపడలేదని తాను గోండు తండాలలో తిరిగాను అని చెప్పారు. ఓట్ల కోసం కాదని ప్రజల కోసం తిరిగాను అన్నారు. తెలంగాణా 2007లో తెలంగాణా నలుమూలలా వెళ్ళిన వాడిని కూడా తానే అన్నారు. తనకు ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రేమ కాదని ఆయన స్పష్టం చేశారు.

అన్నింటికీ ఆంధ్రులేనా :

ఈ సందర్భంగా పవన్ కొన్ని సెటైరికల్ కామెంట్స్ కూడా చేశారు. తెలంగాణా వచ్చి ఇన్నేళ్ళ కాలంలో అక్కడి వారికి ఉపాధి లేకపోతే దానికి ఆంధ్రా వారే కారణమా అని ప్రశ్నించారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ కారణమా అని కూడా నిలదీశారు. తనను ఎందుకు రావద్దు అని అంటున్నారో చెప్పాలని పవన్ అన్నారు. తెలంగాణా ప్రజలు కూడా ఈ విషయం గమనించాలని పవన్ గట్టిగా కోరారు.

తెలంగాణా అంటే ఇష్టం :

మొత్తానికి పవన్ తన మనసులో మాటను చెప్పారు. తనకు తెలంగాణా అంటే ఇష్టమని ఆయన అన్నారు. ఎంత ఇష్టమో చెప్పలేనని అన్నారు. అందుకే ఆయన్ను ఆంధ్రా అంటే నచ్చడం లేదని అంటున్నారు. కానీ ఆంధ్రా వాడిగానే పవన్ ని చూస్తూ ఆయన సభలకు సమావేశాలకూ అడ్డంకులు సృష్టిస్తూ దూరం చేయడం పట్ల అయితే ఆయన తీవ్రంగా మధన పడుతున్నారు, ఆవేశపడుతున్నారు. తనను అలా ఆంధ్రుడి అని ఒక ప్రాంతానికి కట్టేసి ముద్ర వేయడం పట్ల పవన్ అయితే చాలా ఆవేశపడుతున్నారు, ఆగ్రహంతో ఊగిపోతున్నారు కూడా. నిజంగా ఒక ప్రాంతం పట్ల అంత ప్రేమ పెంచుకున్న ఆయన విషయంలో తెలంగాణా నాయకులు ఈ విధంగా చేయకూడదేమో ఆలోచించాల్సిందే మరి.



Tags:    

Similar News