పవన్ చెప్పారు.. బాబు చేశారు: డబ్బులే డబ్బులు!
అదే సమయంలో విద్యుత్ బల్లులకు సంబంధించి కూడా కొంత మేరకు ఉపశమనం కల్పించాలని పవన్ కల్యాణ్ సూచించారు. దీనిపై చంద్రబాబు అధికారులను ఆదేశించారు.;
ఏపీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ-జనసేనల మధ్య కలివి జోరుగా సాగుతోంది. ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించడమే కాదు. ప్రజలకు అవసరమైన నిర్ణయాలు కూడా కలివిడిగా తీసుకుంటున్నారు. ఈ క్రమం లో చంద్రబాబు సూచనలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఇదేసమ యంలో పవన్ కల్యాణ్ చెప్పిన సూచనలను చంద్రబాబు కూడా అనుసరిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మంచి పనులు జరుగుతున్నాయన్న చర్చ సాగుతోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రంలోని పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులను నేరుగా ఇవ్వాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. దీనికి చంద్రబాబు ఓకే చెప్పారు. అప్పట్లో కేంద్రం నుంచి 1100 కోట్ల రూపాయలు వచ్చాయి. వాటిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసింది. అంతేకాదు.. కొన్నాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 110 కోట్ల రూపాయల వాటాను కూడా ఇచ్చారు. దీంతో రహదారుల నిర్మాణం, గోశాలలను చేపట్టారు. ఫలితంగా పంచాయతీల్లో రూపు రేఖలు మారుతున్నాయి.
అదే సమయంలో విద్యుత్ బల్లులకు సంబంధించి కూడా కొంత మేరకు ఉపశమనం కల్పించాలని పవన్ కల్యాణ్ సూచించారు. దీనిపై చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పంచాయతీలకు రాయితీల విషయంలో రాజీ పడొద్దని పేర్కొన్నారు. ఈ పరంపరలో తాజాగా మరో కీలక ప్రతిపాదనను పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుముందు పెట్టారు. పంచాయతీల్లో వ్యవసాయ భూములను గృహ నిర్మాణాలు సహా ఇతర కట్టడాలకు అనుకూలంగా మార్చుకునేందుకు `నాలా` చట్టం అనుమతిస్తుంది.
ఈ చట్టం కింద.. వ్యవసాయ భూములను కట్టడాలకు, ప్రాజెక్టులకు వినియోగించుకునేలా.. మార్పు చేస్తా రు. ఇది పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలో ఉంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరు స్తారు. అయితే.. అలా కాకుండా.. నారా పన్ను చట్టం కింద వస్తున్న సొమ్మును కూడా పంచాయతీలకు ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించారు. తద్వారా పంచాయతీలు మరింత ఆర్థికంగా పుంజుకుంటాయని తెలిపారు. దీనికి చంద్రబాబు ఓకే చెప్పారు. ఫలితంగా సెప్టెంబరు 1 తర్వాత నుంచి నాలా పన్ను చట్టం కింద వచ్చే సొమ్మును నేరుగా పంచాయతీ ఖాతాలకు మళ్లించనున్నారు. దీంతో పంచాతీయలకు సొమ్ములు ఇబ్బడి ముబ్బడిగా అందనున్నాయి.