ఏంటీ 'డీడీవో'లు.. పవన్ ఎలా ఆదర్శమయ్యారు?
డివిజినల్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌నే డీ-డీ-వోగా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు క్లస్టర్లుగా ఉన్న పంచాయతీ వ్యవస్థలో కస్టర్ వ్యవస్థను రద్దు చేశారు.;
ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. గ్రామీణ వ్యవస్థను ఆయన తీర్చిదిద్దే బాధ్యతలు భుజాన వేసుకున్నారు. గత 17 మాసాల్లో.. ఇప్పటి వరకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకుని అమలు చేశారు. రహదారుల నిర్మాణం.. పశువుల పాకలు, నీటి శుద్ధి యంత్రాల ఏర్పాటు., విద్యుత్ సహా మౌలిక సదుపాయాలను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
అదేసమయంలో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా క్రమం తప్పకుండా తెస్తున్నారు. వీటిని సంబంధితపంచాయతీ ఖాతాల్లో పడేలా.. నిర్దేశిత ప్రమాణాలతో వాటిని వినియోగించుకునేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పంచాయతీల పరిధిలో సమూల మార్పులు చేస్తూ.. డీడీవో వ్యవస్థను తీసుకువచ్చారు. వీటికి మరింత ప్రాధాన్యం పెంచారు. అంతేకాదు.. ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించేదిశగా కూడా అడుగులు వేశారు.
ఏంటీ డీడీవో..?
డివిజినల్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌నే డీ-డీ-వోగా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు క్లస్టర్లుగా ఉన్న పంచాయతీ వ్యవస్థలో కస్టర్ వ్యవస్థను రద్దు చేశారు. ఈ స్థానంలో క్లస్టర్లను డివిజన్లుగా విభజించి.. వాటికి ఎంపీడీవోల ను మినీ కలెక్టర్లుగా మార్పు చేస్తూ.. మరిన్ని అధికారాలు అప్పగిస్తూ.. డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(డీడీవో)గా పేర్కొంటూ సరికొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఈ స్థాయిలో ఉన్న అధికారికి.. దాదాపు సహాయ కలెక్టర్ అధికారాలను అప్పగించారు.
ఏం జరుగుతుంది?
క్లస్టర్ వ్యవస్థ ఉన్నప్పుడు.. అన్ని అధికారాలు.. కలెక్టర్‌కు ఉండేవి. అయితే దీనివల్ల పనుల వేగం తగ్గి అభివృద్ధి కుంటుపడుతూ వచ్చింది. దీంతో ఈ అదికారాల్లో కొన్నింటిని డీడీవోలకు అప్పగించారు. అదే సమయంలో భారీవిస్తీర్ణంలో ఉన్న క్లస్టర్లను కుదించి.. డీడీవోలుగా ఏర్పాటు చేశారు. తద్వారా.. తక్కువ ప్రాంతాల్లో ఎక్కువ అభివృద్ధి సమయానికి జరిగేలా నిర్ణయం తీసుకుంటారు. పైగా..పంచాయతీరాజ్‌వ్యవస్థలో గత రెండు దశాబ్దాలుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నవారికి.. ఊహించని విధంగా డీడీవోలుగాపదోన్నతులు కల్పించడం మరో విశేషం. ఒకరకంగా..ఈ వ్యవస్థ పంచాయతీలకు వెన్నుదన్నుగా మారనుంది. అందుకే... పవన్ ఆదరశమయ్యారు.