జ‌న సైనికులూ.. క‌ద‌లండి: ప‌వ‌న్ పిలుపు!

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్.. త‌న పార్టీ కార్య‌కర్త‌లు, నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు.;

Update: 2025-09-27 18:30 GMT

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్.. త‌న పార్టీ కార్య‌కర్త‌లు, నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు. అయితే.. ఇది ఏపీకి సంబంధించిన విష‌యంకాదు. ప్ర‌స్తుతం ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో అత‌లాకు త‌లం అవుతున్న హైద‌రాబాద్‌ను ఉద్దేశించి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, నాయ‌కుల‌కు ప‌వ‌న్ పిలుపునిచ్చారు. హైద‌రాబాద్ లోని లోత‌ట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వారికి అండ‌గా ఉండాల‌ని.. భోజ‌న‌, వ‌స‌తి స‌దుపాయాలు కూడా అందించాల‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌వ‌న్ సూచించారు.

ప‌రిస్థితి దారుణం!

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్‌ విలవిలలాడుతోంది. అనేక ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యా యి. మూసీ న‌ది పొంగి పొర్లుతోంది. దీంతో ఎంజీబీఎస్ బ‌స్టాండ్ స‌హా అనేక ప్రాంతాలు వరద గుప్ప‌ట్లో చిక్కుకున్నా యి. మూసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌ లోయర్ బ్రిడ్జిల పై నుంచి వరద ప్ర‌వాహం సాగుతోంది. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మ‌రింతగా వ‌ర‌ద ప్ర‌భావం పెరిగింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు బ‌స్టాండ్‌లో చిక్కుకున్న‌ ప్రయాణికులను సురక్షితంగా బయటకుతెచ్చారు.

పలు బస్సులను జేబీఎస్‌ వరకే అనుమతించ‌గా.. ఒకవైపు రోడ్డు మొత్తం మూసేవేశారు. మూసీ తీరంలోని పలు కాల నీల్లోకి భారీగా వరద నీరు చేరింది. భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. మూసీ ఉధృతిపై స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ అధికారులను అప్రమత్తం చేసిన సీఎం మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. పురానాపూల్‌లో ఓ ప్ర‌ముఖ శివాలయం నీట మునిగింది. ఈ నేప‌థ్యంలో పూజారి కుటుంబం శివాలయంలో చిక్కుకుపోయింది.

ఏపీ నుంచి జ‌న సైనికులు..

హైద‌రాబాద్ ప‌రిస్థితిని తెలుసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల‌ని సూచించారు. దీంతో ఏపీ నుంచి వంద మంది జ‌న‌సైనికుల‌ను హైద‌రాబాద్ పంపించి.. సాయం చేసేలా చూడాల‌ని పార్టీ నిర్ణ‌యించింది. మ‌రోవైపు.. తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న ప‌వ‌న్‌.. హైద‌రాబాద్‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News