హిందీ భాష మనది...బల్ల గుద్ది మరీ చెప్పిన పవన్!

దక్షిణాదిన కొన్ని రాష్ట్రాలు హిందీ భాష వద్దు అంటూ ఉద్యమాలు చేస్తున్నాయి. అసలు భాషా పరమైన వివాదాలు వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి.;

Update: 2025-07-11 09:58 GMT

దక్షిణాదిన కొన్ని రాష్ట్రాలు హిందీ భాష వద్దు అంటూ ఉద్యమాలు చేస్తున్నాయి. అసలు భాషా పరమైన వివాదాలు వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటక, మహారాష్ట్ర త్రిభాషా విద్యా విధానంలో హిందీ ఎందుకు అని ప్రశ్నించాయి. తమిళనాట ఎప్పటి నుంచో హిందీ విషయంలో వ్యతిరేకత ఉంది.

ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హిందీ భాష మనది అన్నారు. జాతీయ భాష అన్నారు. రాజ భాష అన్నారు. హిందీ విషయంలో భయం ఎందుకు అని ప్రశ్నించారు. ఉర్దూ పర్షియన్ తో పాటు ఇతర భాషలను స్వాగతిస్తున్న మనకు హిందీతో ఇబ్బందులు ఏమిటి అని ప్రశ్నించారు జర్మనీ జపాన్ సహా ఇతర భాషలను అనేక విదేశీ భాషలను నేర్చుకుంటున్న మనకు జాతీయ భాష అయిన హిందీ విషయంలో ద్వేషం ఎందుకు ఉండాలని ఆయన అన్నారు.

మన ఇంట్లో మన రాష్ట్రంలో మాట్లాడేది మాతృ భాష. అయితే రాష్ట్రం దాటితే అందరినీ కలిపే రాజ భాష హిందీ అని పవన్ అభివర్ణించారు. హిందీ భాష విషయంలో వివాదాలు చేయడం తగదని ఆయన అన్నారు. హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది దక్షిణాది అని హిందీ భాష విషయంలో సాగుతున్న వివాదాలు భాష మీద ఆధిపత్య

రాజకీయలు సాగుతున్నాయని పేరుతో ద్వేషిస్తున్న తీరు కొనసాగుతున్న వేళ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

అందరికీ హిందీ దివస్ అభినందనలు తెలిపిన పవన్ హిందీ భాష ప్రాముఖ్యత గురించి దేశంలో ఆ భాష పోషించే కీలక పాత్ర గురించి వివరించారు. భాషా భేదాలు విడనాడాలని ఆయన ఒక మంచి సందేశం ఇచ్చారు. హిందీని ప్రేమిద్దామని పవన్ అన్నారు మన భాషగా భావిద్దామని కూడా ఆయన చెప్పారు. దేశంలో అనేక భిన్న సంస్కృతులు ఉన్నాయని అనేక భాషలు ఉన్నాయని అలా ఉన్న అందరినీ కలిపే భాష హిందీ అని ఆయన చెప్పారు.

దేశానికి సంబంధించి హిందీ ఒక కామన్ భాషగా ఉంటుందని అన్నారు. విదేశీయులు సైతం హిందీని నేర్చుకుంటూంటే మన భాష హిందీని మనం వ్యతిరేకించడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. హిందీతో రాజకీయాలు మానుకోవాలని ఆయన కోరారు. బెంగాళీ జాతీయ గీతం అయింది, అబ్దుల్ కలాం మిసైల్ మాన్ అయ్యారు, దక్షిణ భారత దేశస్తుడు తయారు చేసిన జెండా జాతీయ జెండా అయింది, హిందీ అందరి భాషా ఎందుకు కారాదని పవన్ నిలదీశారు.

ప్రతీ భాష జీవ భాషగానే చూడాలని అన్నారు. అదే సమయంలో హిందీ అందరినీ కలిపే రాష్ట్ర భాషగా చూడాలని పవన్ సూచించారు. మాతౄ భాష మన అమ్మ భాష అయితే హిందీ పెద్దమ్మ భాష అని ఆయన అభివర్ణించారు. ఏ కారణం లేకుండా హిందీని వ్యతిరేకించడం అంటే భావి తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్లే అని పవన్ అన్నారు.

దేశంలోని అనేక ప్రాంతీయ చిత్రాలలో 31 శాతం హిందీలోకి డబ్ అవుతున్నాయని పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యాపారానికి హిందీ కావాలి కానీ నేర్చుకోవడానికి మాత్రం అభ్యంతరం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. తాను ఎంతగానో జాతీయ భాషను ప్రేమిస్తాను అని అందుకే ఏనాడో తాను నటించిన ఖుషీ సినిమాలో హిందీ పాట పెట్టాను అని ఆయన అన్నారు. హిందీ తన జాతీయ భాష అని చెప్పడానికే అలా చేశాను అని ఆయన అన్నారు. హిందీ గొప్పతనం అంతా తెలుసుకోవాలని ఆయన కోరారు. హిందీ భాష మీద నా చిత్తశుద్ధీ అని ఆయన చెప్పారు.

మొత్తం మీద చూస్తే పవన్ అర్ధవంతంగా మాట్లాడారు, హిందీ విషయంలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని ఆయన తార్కికంగానే తిప్పికొట్టారు. దేశంలో విభిన్న రాష్ట్రాలను కలిపి ఉంచే కామన్ భాషగా హిందీని చూడాలని కోరారు. భాషను కూడా రాజకీయాలు చేసి సంకుచితంగా వ్యవహరిస్తున్న నాయకులకు చెంపపెట్టుగా పవన్ ప్రసంగం సాగింది అని అంటున్నారు.

హిందీ భాష విషయంలో ఎక్కువగా మక్కువ చూపే వారంతా పవన్ స్పీచ్ కి ఫిదా అవుతున్నారు. ఆయన చెప్పింది నిజమే కదా అని కూడా వారు అంటున్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన నాయకుడు, అందునా దక్షిణాదికి చెందిన నాయకుడు నోట నుంచి ఇంత పెద్ద ఎత్తున హిందీకి మద్దతు దక్కడం అంటే గ్రేటే. అదే సమయంలో గుడ్డిగా హిందీని వ్యతిరేకించే వారికి మాత్రం ఇది మింగుడు పడని విషయమే అని అంటున్నారు.


Tags:    

Similar News