పవన్ ఫీవర్ తీవ్రత అంత ఎక్కువగా ఉందా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రమైన దగ్గుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.;

Update: 2025-09-27 04:43 GMT

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రమైన దగ్గుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వైరల్ ఫీవర్ నాలుగురోజులకు కూడా అదుపులోకి రాకపోవటం ఒక ఎత్తు.. ఎంతకూ తగ్గిన దగ్గుతో అవస్థలు పడుతున్న విషయం బయటకు వచ్చింది. రెండురోజుల క్రితమే ఆయన నటించిన ఓజీ విడుదల కావటం.. సక్సెస్ మాట ప్రతినోటా వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. సక్సెస్ ను ఆయన ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

మంగళగిరిలో ఆయనకు వైద్యం చేసిన వైద్య నిపుణులు.. ఆయనకు కొన్ని పరీక్షలు చేయించాలని సూచన చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్లుగా సమాచారం. అయితే.. అదే ఆసుపత్రి అన విషయాన్ని మాత్రం బయటకు పొక్కనీయటం లేదు.

ఇదిలా ఉండగా.. పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరా తీశారు. ఆయన వెంటనే కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందించారు. ప్రేక్షకాదరణ పొందిన ఆయన మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేసేందుకు పవన్ త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తరచూ అనారోగ్యం బారిన పడుతున్న పవన్ కల్యాణ్ కు.. ఈసారి మరింత తీవ్రతతో దగ్గు.. జ్వరం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఏపీ మంత్రి నారా లోకేశ్ సైతం పవన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలన్న లోకేశ్.. ‘రాష్ట్రానికి ఆయన సేవలతో స్ఫూర్తినిస్తూ ఉండాలి. ఓజీ విజయాన్ని అభిమానులు..శ్రేయోభిలాషులతో కలిసి జరుపుకోవాలి’ అన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. తన పోస్టులు పెట్టిన గవర్నర్.. చంద్రబాబు.. లోకేశ్ లకు థ్యాంక్స్ తెలియజేశారు. వైద్య పరీక్షల అనంతరం.. ఆయనకున్న ఆరోగ్య సమస్య ఏమిటన్న దానిపై స్పష్టత వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఆయన్ను అభిమానించే కోట్లాది మంది ఆయన ఆరోగ్యం కుదుట పడాలని కోరుకుంటున్నారు.

Tags:    

Similar News