రీజన్స్ ఓకే...పవన్ రికార్డు !
ఇక ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 3 వరకూ చూస్తే కనుక 15 దాకా కేబినెట్ సమావేశాలు జరిగితే పవన్ కేవలంఅందులో కొన్ని మాత్రమే హాజరయ్యారని అంటున్నారు.
కారణాలు ఏవైనా కూడా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కొత్త రికార్డునే నెలకొల్పారని అంటున్నారు. ఆయన వరసగా కేబినెట్ భేటీలకు గైర్ హాజరు అవుతూండడం తాజాగా గురువారం మీటింగులో కూడా కొనసాగింది. అఫ్ కోర్స్ పవన్ కేరళంలో ప్రకృతి ఆయుర్వేద చికిత్సను తీసుకుంటున్నారు. అయితే దీని కంటే ముందు కూడా కొన్ని మంత్రి వర్గ సమావేశాలకు పవన్ దూరంగా ఉన్నారు. అంతకు ముందు సమావేశాలకు వచ్చినా జ్వరం ఇతర కారణాలతో మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా చూస్తే గడచిన రెండేళ్ళలో టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్వహించిన దాదాపుగా 50 దాకా మంత్రి వర్గ సమావేశాలలో పవన్ అరడజన్ కి పైగానే గైర్ హాజరు అయినట్లుగా చెబుతున్నారు.
ఇప్పటిదాకా చూస్తే కనుక :
ఇక ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 3 వరకూ చూస్తే కనుక 15 దాకా కేబినెట్ సమావేశాలు జరిగితే పవన్ కేవలంఅందులో కొన్ని మాత్రమే హాజరయ్యారని అంటున్నారు. అంటే 11 సమావేశాలు ఆయన అటెండ్ కాలేదనే చెబుతున్నారు. అయితే ఆయన తరచూ అనారోగ్యం బారిన పడుతున్నందువల్ల ఈ విధంగా జరుగుతోంది అని అంటున్నారు. ఇక ఇటీవల చూస్తే ముంబైలో ఒక ఆసుపత్రిలో పవన్ తన భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ భుజం నొప్పి ఇంకా తగ్గకపోవడంతో ఆయన కేరళం వెళ్లారు అన్నది తెలిసిందే.
వ్యూహాత్మక ధోరణినా :
అయితే పవన్ గైర్ హాజర్ వ్యూహాత్మకమా అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది. పవన్ లో అసంతృప్తి ఏమైనా ఉందా అన్నది కూడా చర్చించేవారు ఉన్నారు. ఎందుకంటే కలెక్టర్ల సదస్సుని ప్రతీ మూడు నెలలకు ఒక మారు కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్వహిస్తూ వస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ మీటింగ్స్ కి పవన్ మొదట్లో హాజరయ్యేవారు. తరువాత పెద్దగా వెళ్ళింది లేదని కూడా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వీటి సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రావడం లేదన్న రీజన్ ఓకే కానీ ఒక కేబినెట్ లో కీలక మంత్రి అందునా ఉప ముఖ్యమంత్రి ఇలా తరచూ గైర్ హాజరు కావడం అంటే కొంత చర్చ జరిగే అవకాశం ఉంటుంది కదా అని అంటున్నారు. పైగా గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటే అరుదైన సందర్భాలలో తప్పించి జరగలేదని అంటున్నారు.
వేరే సంకేతాలు :
నిజానికి పవన్ గైర్ హాజరు అన్నది ఒక స్పెషల్ విషయంగా చూసినా ఇదే విధంగా ఎవరైనా గైర్ హాజరు అయితే మాత్రం అది రాజకీయంగా చర్చగానే ఉంటుందని అంటారు. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ తరఫున మంత్రి అయిన వారు కూడా గైర్హాజర్ అయితే కూడా రాజకీయంగా చిలవలు పలవలు అల్లుతారు అని అంటున్నారు. కానీ ఇక్కడ పవన్ వేరే పార్టీ అధినేత. దాంతో ఈ రాజకీయ చర్చలు మరింత ఎక్కువగానే జరుగుతాయని అంటున్నారు. అయితే కూటమి ఐక్యంగా ఉంది అనడానికి పవన్ గైర్ హాజరుని సైతం కూటమి సానుకూల దృక్పధంతోనే చూస్తూ ఆయన హెల్త్ ఇష్యూస్ మీద కన్ సెర్న్ చూపిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి పవన్ సెప్టెంబర్ 10న కేరళం నుంచి ఆరోగ్యవంతులై వస్తారని అంటున్నారు. ఆ తరువాత ఇదే నెలలో మరో కేబినెట్ మీటింగ్ జరగనుంది. దానికైనా హాజరు అవాలని కోరుకుంటున్నారు అంతా.