జనసేన కమిటీలు రద్దు...పవన్ మార్క్ సంచలనం

జనసేన పార్టీలో వీర మహిళ, యువజన, విద్యార్థి విభాగాలు ఉన్నాయి. వీటికి ఇప్పటిదాకా ఉన్న కమిటీలను రద్దు చేశారు.;

Update: 2026-01-05 17:21 GMT

జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా జనసేన కమిటీలను అన్నీ రద్దు చేశారు. అయితే అది ఏపీలో కాదు, తెలంగాణాలో. అవును పవన్ తెలంగాణాలో జనసేన పార్టీ విషయంలో గత కొంతకాలంగా తీవ్రంగా ఆలోచిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ డెసిషన్ కి వచ్చారు అని అంటున్నారు. దీంతో టోటల్ గా పార్టీ ప్రక్షాళన మొదలవుతుందని అంటున్నారు. ఇటీవలనే కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన పవన్ అక్కడ టీటీడీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ వెంటనే ఆయన తెలంగాణాకు చెందిన నాయకులతో ముఖ్య సమావేశాన్ని నిర్వహించి తనకు తెలంగాణా అంటే ఎంత ఇష్టమో స్పష్టంగా చెప్పారు కూడా.

అడహాక్ కమిటీలతో :

ఇదిలా ఉంటే సడెన్ గా తెలంగాణ రాష్ట్ర జనసేన కమిటీలను చేసిన అధినాయకత్వం వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీలని ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని జనసేన పార్టీ ప్రకటించింది. ఎందుకు ఇలా అంటే జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయడం కోసమే అని ఒక ప్రకటన ద్వారా జనసేన పేర్కొంది. అంతే కాదు మొత్తం తెలంగాణాలోని అన్ని జిల్లాలలతో పాటు నియోజకవర్గాలలో పార్టీల కమిటీలలో కీలక మార్పులు చేయాలని కూడా నిర్ణయించినట్లుగా వెల్లడించింది.

అనుబంధ విభాగాల్లో :

జనసేన పార్టీలో వీర మహిళ, యువజన, విద్యార్థి విభాగాలు ఉన్నాయి. వీటికి ఇప్పటిదాకా ఉన్న కమిటీలను రద్దు చేశారు. ఇక వీటి ప్లేస్ లో టెంపరరీగా అడ్ హాక్ కమిటీలను నియామకం చేస్తున్నట్లుగా పార్టీ పేర్కొంది. అయితే ఈ అడ్ హాక్ కమిటీలు కూడా ఒక నెల రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. అనంతరం కొత్త కమిటీలను అన్ని చోట్లా ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు. ఈ అడ్ హాక్ కమిటీ సభ్యులు నెల రోజుల పాటు ప్రతీ నియోజకవర్గంతో పాటు జీ హెచ్ ఎం సీలోని వార్డూల్లో పర్యటిస్తూ అక్కడ కీలకంగా పార్టీ కోసం పనిచేసే వారి జాబితాను తెచ్చి అధినాయకత్వానికి అందచేస్తారు. ఆ మీదట అందులో నుంచి సమర్ధవంతమైన నాయకులను ఎంపిక చేసి కొత్త కమిటీలను ఏర్పాటు చేయడానికి జనసేన ఉద్యుక్తమవుతోంది.

పవన్ సీరియస్ గా :

ఇక పవన్ కళ్యాణ్ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే విషయంలో సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ఆయన కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఎంతో కృషి చేస్తున్నారు ఆ విధంగా చేయడం ద్వారా తెలంగాణా ప్రజల మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు రానున్న రోజులల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేస్తున్నారు అని తెలుస్తోంది. ఆ విధంగా గ్రాస్ రూట్ లెవెల్ లో పార్టీని పటిష్టం చేసుకుంటే 2028లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమం అవుతుందని పార్టీ అంచనా వేస్తోంది అంటున్నారు.

పొత్తులు ఉంటాయా :

ఇక మరో వైపు చూస్తే కేంద్రంలో బీజేపీ 2028 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణాలో అధికారంలోకి రావాలని చూస్తోంది అని అంటున్నారు. బలమైన సామాజిక వర్గం దన్నుతో పాటు పవన్ సినీ గ్లామర్ అన్నీ కలిసి జనసేనకు తెలంగాణాలో బాగానే ఆదరణ ఉంటుందని బీజేపీ కూడా ఊహిస్తోంది. దాంతో ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేనతో 2028 ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని కూడా కాషాయం పెద్దలు ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో జనసేన కూడా ముందు పార్టీ బలోపేతం మీద ఫుల్ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. ఏపీ నుంచి తెలంగాణాలో సీరియస్ గా ఫోకస్ పెడుతున్న పార్టీగా జన్సేన ముందు ఉండడమే ఇపుడు చర్చగా రాజకీయాల్లో ఉంది. చూడాలి మరి జనసేన తెలంగాణాలో తన సత్తా ఏ విధంగా చాటుకుంటుందో. రానున్న రోజులల్లో అక్కడ రాజకీయ సమీకరణలలో జనసేన ప్రభావం ఏ మేరకు ఉంటుందో.

Tags:    

Similar News