కవలలకు షాక్ ఇచ్చిన డిజియాత్ర.. ఇది ఎలా పనిచేస్తుంది? పూర్తి వివరాలివే!

ఇక ఎవరూ కూడా అక్కడి డాక్యుమెంట్లను ఫిజికల్ గా తనిఖీ చేసే పరిస్థితి ఏర్పడదు. అత్యంత వేగంగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. అయితే ఇలాంటి డిజియాత్ర కవలలకు భారీ షాక్ కలిగించింది.;

Update: 2026-01-07 06:53 GMT

విమానాల ద్వారా విదేశాలకు వెళ్లేవారు.. విమానాశ్రయాల్లోకి సౌకర్యవంతంగా.. త్వరగా ప్రవేశించేందుకు వీలుగా ముఖ గుర్తింపు సాంకేతికతను వినియోగించడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే గత ఏడాది డిజియాత్ర అనే ఒక ఫేస్ రికగ్నిషన్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య ప్రయాణానికి ఈ డిజియాత్ర యాప్ ను అభివృద్ధి చేశారు. ఆధార్ ఆధారంగా పెద్దలతో పాటు పిల్లల వివరాలను కూడా ఇందులో నిక్షిప్తం చేయవచ్చు. ఇందుకోసం ప్రతి ఒక్కరి ముఖాన్ని సెల్ఫీ ద్వారా చిత్రీకరించాలి. తదుపరి ప్రయాణానికి ముందు బోర్డింగ్ పాస్ వివరాలను సంబంధిత ఫీచర్లో జత చేస్తే సరిపోతుంది.

ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, వారణాసి, కోల్కతా, పూణే , కొచ్చి , ముంబై తదితర విమానాశ్రయాల్లో డిజియాత్ర కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడ ఉండే స్కానర్ వద్ద మొబైల్ లోని డిజియాత్ర యాప్ లో ఉన్న బోర్డింగ్ పాస్ ను స్కాన్ చేసి అక్కడే ఉన్న కెమెరా ఎదుట మన ముఖాన్ని ఉంచితే చాలు సెకండ్ల వ్యవధిలోనే అనుమతి లభించి గేట్ లు ఆటోమేటిక్ గా తెరుచుకుంటాయి. ఇక ఎవరూ కూడా అక్కడి డాక్యుమెంట్లను ఫిజికల్ గా తనిఖీ చేసే పరిస్థితి ఏర్పడదు. అత్యంత వేగంగా విమానాశ్రయంలోకి ప్రవేశించవచ్చు. అయితే ఇలాంటి డిజియాత్ర కవలలకు భారీ షాక్ కలిగించింది.

అసలు విషయంలోకి వెళ్తే.. వాళ్ళిద్దరూ కవలలు. ఐడెంటికల్ ట్విన్స్.. చూడడానికి అచ్చం ఒకేలా ఉంటారు. అయితే ఈ సోదరులు ఇద్దరు జర్నీ కోసం ముంబై ఎయిర్పోర్ట్ కి చేరుకోగా డిజియాత్ర యాప్ ద్వారా ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ యాప్ వీరికి షాక్ ఇచ్చింది. ఇద్దరిలో ఒకరు ముందుగా వెళ్ళగా స్కాన్ చేసి వారిని లోపలికి పంపించింది. ఆ తర్వాత మరొకరు వెళ్ళగా యాక్సిస్ డినైన్డ్ అంటూ స్క్రీన్ పై చూపించింది. అంటే ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే యాక్సిస్ ఉంటుందని స్క్రీన్ పై డిస్ప్లే అవ్వడంతో ఆ కవలలు ఇద్దరు షాక్ అయ్యారు .చూడడానికి రూపంలో ఒకేలా ఉండడంతోనే టెక్నాలజీ కూడా వారిని గుర్తించలేకపోయింది. ఈ క్రమంలోనే తమలాంటి వారి కోసం ఏదైనా వెసులుబాటు తీసుకురావాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

విమాన ప్రయాణాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఈ డిజియాత్ర యాప్ ను ఉపయోగిస్తూ ఉంటారు..ఎయిర్పోర్ట్లో ఐడెంటిఫికేషన్ కోసం ఉపయోగపడే ఈ యాప్ భారీ క్యూ లైన్ లలో నిలబడి సమయం వృధా అవుతుందనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. వీరికి బోర్డింగ్ ప్రాసెస్ కూడా సులభంగా అవుతుంది. ఈ క్రమంలోనే ఈ కవల బ్రదర్స్ ఇద్దరు కూడా ముంబై ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించారు.. కానీ ఈ కవలల్లో ఒకరికి మాత్రమే ఈ యాప్ అనుమతి ఇచ్చింది.. మరొకరు కూడా లోపల వచ్చేందుకు ప్రయత్నం చేయగా ఒకరి కంటే ఎక్కువ మందిని గుర్తించామంటూ స్క్రీన్ పై డిస్ప్లే అయింది. ఏది ఏమైనా ఇలాంటి కవలల కోసం ఈ డిజియాత్ర యాప్ ను టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి చేయాలి అని నేటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.



Tags:    

Similar News