• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆ పాయింట్ తోనే పవన్...

ఆ పాయింట్ తోనే పవన్ టార్గెట్

| జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పదవిని అందుకున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ వీక్ నెస్ ఏంటి అంటే ప్రత్యర్థులే చెప్పాలి. అది తన వ్యూహం అని జనసేనాని అంటారు.

By - Satya P
Update: 2025-11-29 21:30 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పదవిని అందుకున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ వీక్ నెస్ ఏంటి అంటే ప్రత్యర్థులే చెప్పాలి. అది తన వ్యూహం అని జనసేనాని అంటారు. కాదు రాజకీయ బలహీనత అని ప్రత్యర్ధులు వాదిస్తారు. అయితే ఎవరేమనుకున్నా జనసేన ఓటు షేర్ 2019 ఎన్నికల ఫలితాలు కళ్ళ ముందు ఉన్న నేపధ్యం, స్వయంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలు కావడంతో ప్రత్యర్ధులకు అది అంది వచ్చిన అస్త్రంగా మారుతోంది. ఏపీలో వైసీపీ ఎపుడు పవన్ ని టార్గెట్ చేయాలని చూసినా ఆయన ఒంటరిగా పోటీ చేయలేరని అందుకే పొత్తుల కోసం తహ తహలాడుతున్నారని ఘాటుగా విమర్శిస్తుంది. ఇక దీనికి తోడుగా తెలంగాణా పార్టీలు కూడా పవన్ ని ఇదే విషయం మీద గట్టిగా విమర్శిస్తున్నాయి.

దిష్టి డైలాగ్ తో :

పవన్ ఇటీవల కోనసీమ జిల్లా శంకర్ గుప్తంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొబ్బరి రైతులతో ఆయన ముఖాముఖీ నిర్వహించినపుడు కొబ్బరి పంట నాశనం కావడాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణా దిష్టి తగిలింది అని వ్యాఖ్యానించారు ఆ సమయంలో ఆయన సరదాగా అన్నారో లేక రైతులను ఊరడించే ప్రయత్నంలో చెప్పారో తెలియదు కానీ దిష్టి డైలాగ్ అక్కడ చప్పట్లు కురిపించింది. ఆ మీదటనే అది విమర్శల జడివానని కురిపిస్తోంది. మొదట బీఆర్ ఎస్ దీని మీద గట్టిగా తగులుకుంది. ఇపుడు కాంగ్రెస్ వంతు. ఒకరి మీద ఒకరు పోటీ అన్నట్లుగా పవన్ మీద భారీ ఎటాక్ నే చేస్తున్నారు.

గుచ్చి గుచ్చి మరీ :

ఇక బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి అయితే తెలంగాణా వాళ్ళు ఏపీకి ఎందుకు వెళ్తారు, వారి దిష్టి ఎందుకు తగులుతుంది అని ప్రశ్నించారు. ఆంధ్రా వారే హైదరాబాద్ కి వస్తున్నారు కదా అని కూడా అన్నారు. అసలు తెలంగాణా దిష్టి గోదావరివాళ్లకి తగలడం కాదు న్నేళ్లు వాళ్ల దిష్టి మా తెలంగాణకు తాకింది ని ఆయన భారీ కౌంటర్ ఇచ్చారు. అంతేకాక, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ మెదడు వాడకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు అని జగదీష్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇక నర దిష్టి తగిలితే దిష్టి బొమ్మ పెట్టుకోవాలి ఎవరు వద్దన్నారు అని ఆయన కామెంట్స్ చేశారు. ఒక విధంగా పవన్ రాజకీయాన్ని ఆయన విధానాలను బీఆర్ఎస్ అయితే గట్టిగానే విమర్శించింది అని చెప్పాలి.

కాంగ్రెస్ గొంతు పెంచి :

ఇక కాంగ్రెస్ తన వంతుగా ఇదే విషయం మీద పవన్ ని టార్గెట్ చేసింది ఆ పార్టీకి చెందిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అయితే పవన్ తన వ్యాఖ్యల మీద ఇంకా చాలా దూరం వెళ్లారు. పవన్ ఒంటరిగా పోటీ చేసి గెలవలేరని కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఇదే మాటను వైసీపీ కూడా ఏపీలో అంటూ వచ్చింది. ఇపుడు కాంగ్రెస్ నోట వచ్చింది. ఆయన పొత్తులతోనే 2024లో గెలిచారు తప్ప సొంత బలం కాదని ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు. పవన్ ప్రస్తావనకు రాగానే ఈ మాటలే అందరి నోటా వస్తున్నాయీ అంటే ఆ పార్టీ బలహీనతగా దాన్ని చూస్తున్నారా లేక ఆ వ్యూహాన్ని భగ్నం చేయాలని ఆలోచిస్తున్నారా అన్నది అయితే అర్ధం కావడం లేదు అని అంటున్నారు. మరి దీని మీద జనసేన అయితే ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

Tags:    
  • pawankalyan 
  • drishti 
  • telanganadrishti 
  • brs 
  • congress 
  • janasena 
  • apdeputycm 
  • politicaltrolls 
  • pawanvsrivals 
  • appolitics 

Similar News

పాతపగలన్నీ మాని ట్రంప్ కు వేల కోట్లు ఇచ్చినా.. పాపం ఎలన్ మస్క్ పరిస్థితి ఇదీ

2026-11-05 06:37 GMT

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

2026-11-05 06:27 GMT

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

2026-11-05 06:25 GMT

వైసీపీలో అంత‌ర్గ‌త పోరు.. నెల్లూరు మునక‌.. !

2026-11-05 06:23 GMT

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS