బాలయ్య ఎపిసోడ్ తరువాత...బాబు గురించి ఫస్ట్ టైం పవన్ !

ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తరువాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ వేదికగా జనాల ముందు కనిపించారు;

Update: 2025-10-04 15:30 GMT

ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తరువాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ వేదికగా జనాల ముందు కనిపించారు ఆటో డ్రైవర్ల ఖాతాలో పదిహేను వేల రూపాయలు వేసే పధకానికి శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయన ఏమి మాట్లాడుతారు అన్నది అంతా ఆసక్తిగా చూశారు. అయితే పవన్ మాత్రం తనదైన స్పీచ్ నే ఇచ్చారు.

దార్శనికుడు అంటూ :

ఇక చంద్రబాబుని దార్శనీకుడు అని మరోసారి ఈ సభా వేదికగా పవన్ కీర్తించడం విశేషం. అంతే కాదు సమర్ధవంతమైన పరిపాలన చంద్రబాబు అందిస్తున్నారు అని కితాబు ఇచ్చారు. మంచి పాలన ఉంటే జరిగే మేలు ఏమిటి అన్నది ఇపుడు అందరికీ తెలిసి వస్తోంది అని కూడా ఆయన చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పధకం గురించి కేబినెట్ లో చర్చిస్తున్నపుడు ఆటో కార్మికులను దృష్టిలో పెట్టుకున్నామని వారికి మేలు చేస్తామని ఆనాడు బాబు మాట ఇచ్చి ఇపుడు అమలు చేసారని థాంక్స్ టూ బాబు అని కూడా పవన్ చెప్పారు.

భారమైనా కూడా :

నిజానికి ఏపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పధకాలు భారమైనా కూడా అందిస్తున్నామని పవన్ చెప్పారు. ఆటో కార్మికుల కోసం ఒక్కక్కరికీ నెలకు 15 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని దాని వల్ల మూడు కోట్ల మంది దాకా ఆటో కార్మికులకు న్యాయం జరుగుతోందని అన్నారు. అదే విధంగా 436 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చుగా ప్రభుత్వానికి అవుతుందని చెప్పారు. ఇపుడున్న పరిస్థితుల్లో ఎంతో భారంగా ఇది ఉన్నా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఆనందంగా భరిస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు.

కూటమి గ్రేట్ అంటూ :

నిజానికి బాలయ్య అసెంబ్లీలో చేసిన కామెంట్స్ తరువాత కూటమిలో చిచ్చు రేగుతుందని ఏదో అవుతుందని అంతా అనుకున్నాఉరు. కానీ ఆ తరువాత పరిణామాలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామశించడం వంటివి జరిగాయి. దాంతో జనసేన వైపు నుంచి కూల్ గానే వాతావరణం కనిపించింది. మొత్తానికి బాలయ్య ఎపిసోడ్ కూటమి మీద ఏ విధంగానూ ప్రభావం చూపించలేదని పవన్ మాట్లాడిన తీరుతో స్పష్టం అయింది అని అంటున్నారు. అంతే కాదు ఆయన చంద్రబాబు విజనరీ అని సమర్ధ పాలకుడు అని కీర్తించడం ద్వారా కూటమి మరిన్నేళ్ళు అధికారంలో కొనసాగేలా తన వైపు నుంచి చూస్తారు అని అంటున్నారు. ఇక లోకేష్ విషయంలో కూడా పవన్ ఎంతో బాగా మాట్లాడారు. ఆయన నిర్వహిస్తున్న ప్రతీ శాఖ పేరుని వేదిక మీద చదువుతూ తన సోదరుడు అని సంభోదించారు. దాంతో బాలయ్య అసెంబ్లీ ఇష్యూ టీ కప్పులో తుపానులా తేలిపోయింది అని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.

Tags:    

Similar News