• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రూ.6 కోట్ల విరాళం.....

రూ.6 కోట్ల విరాళం.. పవన్‌కు అంత పెద్ద సాయం ఎలా సాధ్యపడింది?

| పవన్ కల్యాణ్.. ఆయనకు సినీరంగంలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.

By - Tupaki Desk
Update: 2024-09-06 09:30 GMT

పవన్ కల్యాణ్.. ఆయనకు సినీరంగంలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు.. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.

కట్ చేస్తే.. ఆయన సినీ రంగంలో ఎంత సెన్సేషనల్ అయ్యారో రాజకీయంగానూ అదే స్థాయిలో ప్రకంపనలు సృష్టించారు. జనసేన పార్టీ స్థాపించి చరిత్రలో ఏ పార్టీ సాధించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందారు. కూలమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశారు. చివరకు కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అయితే.. పవన్ కల్యాణ్‌ది ముందు నుంచి సహాయం చేసే గుణం. ఆపదలో ఉన్నాం అని ఎవరు ఆయన తలపుతట్టినా సహాయం చేయకుండా ఊరుకోరు. అంతెందుకు సినీ విభాగంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని ఏదైనా వార్త అందినా వెంటనే స్పందిస్తారు. ముందు నుంచి ఆయనకు ఈ హెల్పింగ్ నేచర్ అనేది ఉంది.

మొన్న వర్షాలకు ఏపీ అతలాకుతలం అయింది. ముఖ్యంగా బెజవాడను వరదలు ముంచెత్తాయి. దాంతో ఒక్కొక్కరుగా ముందుకొచ్చి తమ ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నారు. కొందరు సినీ హీరోలు తమ తోచినంత సాయం అందించారు. అయితే.. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఏకంగా రూ.6 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన దగ్గర పెద్దగా డబ్బులు లేవు అని అంటారు . సినిమాలూ సరిగా చేయడం లేదు. అటు పార్టీ నడిపించేందుకు పెద్ద ఎత్తున ఖర్చులు అవుతున్నాయి. అంతకుముందు సినిమాలు చేసినా పెద్దగా కూతబెట్టింది లేదు. కానీ.. ఆదుకోవాలనే పెద్ద మనసు మాత్రం ఆయన సొంతం. అందుకే.. మరోసారి పవన్ కల్యాణ్ తన గొప్పతనాన్ని చాటిచెప్పారు.

పవన్ కల్యాణ్ రూ.6 కోట్ల సాయం ప్రకటించడంతో ఇప్పుడు అందరిలోనూ సందేహం మొదలైంది. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అంత పెద్ద సాయం ఇవ్వడంపై పవన్ చాలా గ్రేట్ అని కొనియాడుతూనే.. అంత సాయం ఆయన ఎలా చేయగలిగారు..? అనే సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. తన దగ్గర డబ్బు లేదని పదే పదే చెప్పుకునే పవన్ కల్యాణ్.. ఎవరూ ఇవ్వని విధంగా ఇంత సాయం ప్రకటించడంపై అతని గొప్ప మనసు గురించి మాట్లాడుకున్తున్నారు. అయితే.. ఇటీవలే తన మూడు సినిమాలను పవన్ పట్టాలెక్కించాడని.. వాటి షూటింగ్‌లకు కూడా హాజరయ్యాడని.. ఆ నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్సులతోనే పవన్ ఈ 6 కోట్ల సాయం చేసినట్టు భోగట్టా.

Tags:    
  • Pawankalyan 
  • Deputychiefminister 
  • Janasena 
  • Funds 
  • OG 
  • Hariharaveeramallu 
  • Tdp 
  • Chandrababunaidu 
  • Remuneration 
  • vijayawadafloods 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS