ట్రంప్‌ను బుట్టలో వేసిన పాక్ ఆర్మీ చీఫ్ వ్యూహం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ రూపకల్పన చేసిన వ్యూహం ప్రస్తుతం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.;

Update: 2025-09-28 20:06 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ రూపకల్పన చేసిన వ్యూహం ప్రస్తుతం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కలిసి ఆయన శ్వేతసౌధాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు అరుదైన రేర్ ఎర్త్ మినరల్స్‌తో నిండిన ఒక ప్రత్యేక చెక్క పెట్టెను బహూకరించారు.

ఆ క్షణాలను శ్వేతసౌధం విడుదల చేసిన చిత్రాల్లో స్పష్టంగా చూడవచ్చు. మునీర్ ఆ పెట్టెలోని రంగురాళ్లను ట్రంప్‌కు చూపుతూ వివరణ ఇస్తుండగా, ట్రంప్ ఆసక్తిగా వాటిని పరిశీలిస్తున్నట్లుగా కనిపించారు. దీనిని పాక్ వ్యూహాత్మక కదలికగా చూడడం జరుగుతోంది.

రేర్ ఎర్త్ మినరల్స్ ప్రాధాన్యత

రేర్ ఎర్త్ మినరల్స్‌పై అమెరికా ఆసక్తి కొత్తది కాదు. చైనాకు ఈ రంగంలో ఉన్న ఆధిపత్యాన్ని సవాల్ చేయాలని ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ నేపధ్యంలో పాకిస్థాన్ నిర్ణయం అమెరికా వ్యూహాలకు సరిగ్గా సరిపోతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్, పాక్ సైన్యానికి చెందిన ఫ్రంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ మధ్య ఒక కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో పాకిస్థాన్‌లో పాలీ మెటాలిక్ రిఫైనరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

పాక్ భవిష్యత్‌పై మునీర్ వ్యాఖ్యలు

"పాకిస్థాన్ వద్ద విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ ఖజానా ఉంది. ఇది దేశ ఆర్థిక పరిస్థితిని మార్చేస్తుంది. రుణభారం గణనీయంగా తగ్గిపోతుంది. త్వరలోనే పాకిస్థాన్ సుసంపన్న సమాజాల్లో ఒకటిగా నిలుస్తుంది," అని ఆసిం మునీర్ స్థానిక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ దృష్టిలో పాక్ కొత్త కదలిక

ఈ పరిణామంతో పాకిస్థాన్ తన వ్యూహాత్మకతను మరోసారి చాటుకుంది. అమెరికాకు అవసరమైన కీలక వనరులను చూపించి, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో చైనాతో ఉన్న వనరుల సంబంధాన్ని అమెరికాకు సమతుల్యం చేయాలనే ఉద్దేశ్యంతో పాక్ ఈ వ్యూహాన్ని సిద్దం చేసుకున్నదని నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News