పాకిస్తానీల కష్టాలు.. బెలూన్స్‌లో వంట గ్యాస్‌

ముందస్తుగానే ఇండియా నిల్వ చేసి ఉండటం, ఇరాన్ యుద్ధం ప్రారంభం అయిన వెంటనే కొత్తగా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడం మొదలు పెట్టింది ఇండియా. అందుకే ఇండియాలో ఇంధన కొరత పెద్దగా లేదు.;

Update: 2026-04-29 16:30 GMT

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ జరిపిన యుద్ధం కారణంగా ఆశియా దేశాల్లో అత్యధిక దేశాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇంధన కొరత అత్యధికంగా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ కొరత కారణంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. ఇండియాలో ఇంధన కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అక్కడక్కడ ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో డీజిల్‌ దొరక్క ప్రజలు ఇక్కట్లు పడ్డారు. పెట్రోల్‌ సైతం ఆ మద్య కొరత అనే ప్రచారం జరిగింది. ఇక గ్యాస్‌ సరఫరాలోనూ ఇబ్బందులు ఉన్నాయి. కానీ మరీ దారుణంగా ఇండియాలో పరిస్థితులు లేవు. ముందస్తుగానే ఇండియా నిల్వ చేసి ఉండటం, ఇరాన్ యుద్ధం ప్రారంభం అయిన వెంటనే కొత్తగా ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడం మొదలు పెట్టింది ఇండియా. అందుకే ఇండియాలో ఇంధన కొరత పెద్దగా లేదు.

పాకిస్తాన్‌లో యుద్ధ ప్రభావం...

దాయాదీ దేశం పాకిస్తాన్‌లో మాత్రం ఇంధన కొరత పతాక స్థాయిలో ఉంది. అక్కడి ప్రభుత్వాలు ఇంధనం ను నిల్వ చేసి ఉంచలేదు. ఎప్పటి ఇంధనం అప్పుడు అన్నట్లుగానే అక్కడ వినియోగం జరుగుతుంది. అందుకే పాకిస్తాన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపాలని పాకిస్తాన్‌ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ అవేవి వర్కౌట్‌ కాలేదు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు పాకిస్తాన్‌లో వంట గ్యాస్‌ కి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ గ్యాస్ కొరత కారణంగా జనాలు అల్లాడిపోతున్నారు. ఎప్పుడో ఒక సారి వస్తున్న గ్యాస్‌ ను స్టోర్‌ చేసుకోవడం కోసం రకరకాలుగా పాకిస్తానీలు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్యాస్‌ ను స్టోర్ చేసుకోవడం కోసం పాకిస్తాన్‌లో కొత్తగా బెలూన్‌లను వినియోగిస్తున్నారు.

బెలూన్లలో వంట గ్యాస్‌...

ప్రమాదరహిత నార్మల్‌ గ్యాస్‌ను నిల్వ ఉంచే బెలూన్స్‌ ను ఇప్పుడు వంట గ్యాస్‌ వంటి ప్రమాధకరమైన గ్యాస్‌ ను నిల్వ చేసుకుంటున్నారు. కరాచీలో ఈ బెలూన్స్‌కి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ప్రతి కుటుంబం ఎంతో కొంత గ్యాస్‌ను బెలూన్స్‌ లో నిల్వ ఉంచుకునే ప్రయత్నం చేస్తుందని అక్కడి మీడియా కథనాలను ప్రచురించింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం ఆన్‌ లైన్‌ లో చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత ప్రమాధకరమైన బెలూన్ గ్యాస్‌ వినియోగం ఇప్పుడు అక్కడ సర్వసాధారణం అయ్యింది. బెలూన్‌ లో గ్యాస్ ను ఫిల్‌ చేసుకుని దాన్ని తర్వాత వినియోగించుకోవడం ఏమాత్రం కరెక్ట్‌ కాదని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ బెలూన్‌ ను ఇంట్లో పెట్టుకుంటే పెద్ద బాంబ్‌ను ఇంట్లో పెట్టుకున్నట్లే అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా కూడా జనాలు పట్టించుకోవడం లేదు.

అమెరికా, ఇరాన్‌ యుద్ధ ప్రభావం...

ఇలా గ్యాస్‌ను బెలూన్స్‌ లో ఫిల్‌ చేసి క్యారీ చేయడంను మొబైల్‌ బాం బులుగా పిలుస్తున్నారు. వీటిని చాలా ఈజీగా క్యారీ చేస్తున్నారు. అయితే చిన్న ప్రమాదం జరిగినా పెద్ద నష్టం జరుగుతుందని కొందరు హెచ్చరిస్తున్నారు. చిన్నపాటి రాపిడి జరిగినా, చిన్న లీకేజ్ ఏర్పడినా, అగ్నికి దగ్గరకి వెళ్లినా కూడా చాలా పెద్ద డ్యామేజీ క్రియేట్‌ అవుతుందని హెచ్చరికలు చేస్తున్నారు. అయినా కూడా జనాలు గ్యాస్‌ కష్టాల నుంచి కొంత అయినా ఉపశమనం పొందవచ్చు అనే ఉద్దేశంతో ఇలా స్టోరేజ్ చేసుకుంటున్నారు. భవిష్యత్తులో మరింత ప్రమాదకర స్థాయిలో పాకిస్తాన్‌ యుద్ధ ప్రభావం చూడబోతుందని అంతర్జాతీయ స్థాయి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దేశం ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అమెరికా సాయంతో నెట్టుకు వస్తుంది. ఇప్పుడు యుద్ధం వల్ల అమెరికా సైతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. కనుక అమెరికా నుంచి కూడా సహాయం పొందే అవకాశాలు లేవు. దాంతో పాకిస్తానీలు ముందు ముందు బెలూన్ గ్యాస్ వంటి ప్రమాదకర ప్రయోగాలు మరిన్ని చేయాల్సి రావచ్చు.

Tags:    

Similar News