'ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్'... పాక్ పవర్ ఫుల్ క్షిపణి!

అవును... సరిహద్దుల్లో వరుసగా చావుదెబ్బలు తింటున్న పాకిస్థాన్.. 'ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్' కింద నేరుగా భారతదేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేసింది.;

Update: 2025-05-10 05:07 GMT

గురువారం ఉదయం నుంచి రాత్రి వరకూ పాక్ ను భారత్ ఎన్నిసార్లు గడ్డి పెట్టినా, దాని బుద్ది మారలేదు! గురువారం భారత్ పై విరుచుకుపడేందుకు విఫలయత్నాలు చేసి చావుదెబ్బ తిన్న పాక్.. శుక్రవారం రాత్రి దాడులకు యత్నించింది. ఈ సమయంలో సుమారు 26 ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అయితే... వాటిని భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసింది.

గురువారం 36 ప్రాంతాల్లో సుమారు 300 నుంచి 400 టర్కీష్ క్షిపణులను ప్రయోగించిన పాక్ ప్రయత్నాన్ని భారత్ తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి 26 ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది. ఈ సమయంలో పఠాంకోట్, జైసల్మేర్, ఉధంపుర్, నగ్రోటా ప్రాంతాలపైకి పంపిన 50 డ్రోన్లను సైన్యం నాశనం చేసింది. ఈ సమయంలో ఢిల్లీపైకి క్షిపణిని ప్రయోగించడం గమనార్హం.

అవును... సరిహద్దుల్లో వరుసగా చావుదెబ్బలు తింటున్న పాకిస్థాన్.. 'ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్' కింద నేరుగా భారతదేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా... ఢిల్లీ లక్ష్యంగా పతాహ్-2 క్షిపణిని ప్రయొగించింది. ఇది పాకిస్థాన్ అభివృద్ధి చేసిన గైడెడ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టం.. ఇది ఆ దేశ అంబులపొదిలేనో శక్తివంతమైన క్షిపణిగా చెబుతారు.

అయితే... పాక్ ప్రయోగించిన ఈ -పతాహ్-2 క్షిపణిని హర్యానాలో సీర్సా మీదుగా ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థను ఉపయోగించి భారత్ కూల్చివేసింది. మరోవైపు ఉత్తర భారత్ లో ఉన్న వ్యూహాత్మక సైనిక స్థావరంపైకి పతాహ్-1 క్షిపణిని ప్రయోగించింది పాక్. అయితే.. దీన్ని కూడా భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుని నిర్వీర్యం చేసింది.

కాగా... పతాహ్-2 క్షిపణి పాకిస్థాన్ అభివృద్ధి చేసిన, కలిగి ఉన్న శక్తివంతమైన క్షిపణుల్లో ఒకటి. ఇది 150 కిలోమీటర్ల పరిధి లక్ష్యాలను చేధించే సత్తాకలిగిన పతాహ్-1 కి అప్ గ్రేడ్. ఈ పతాహ్-2 సుమారు 400 కి.మీ. పరిధి వరకూ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేధించగల సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని.. నేరుగా ఢిల్లీపైకి ప్రయోగించింది పాక్!

Tags:    

Similar News