రీల్స్ లో అవి కనిపిస్తే క్షణాల్లో ఇంటి ముందుకు ఎఫ్‌బీఆర్.. తస్మాత్ జాగ్రత్త..!

అడుక్కుతినే స్థాయికి దిగిజారిన తర్వాత కాపాడుకోవాలన్న ఆలోచన వచ్చింది ఆ దేశ పాలకులకు. దీన్నే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు.;

Update: 2025-09-24 18:30 GMT

అడుక్కుతినే స్థాయికి దిగిజారిన తర్వాత కాపాడుకోవాలన్న ఆలోచన వచ్చింది ఆ దేశ పాలకులకు. దీన్నే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటారు. ఇది పొరుగున ఉన్న పాకిస్తాన్ పరిస్థితి. గోధుమ పిండి కోసం కొట్టుకున్న పాకిస్తాన్ ఇప్పుడు దిద్దుబాటుకు పూనుకుంటుంది. పొరుగు దేశంతో సఖ్యతగా ఉంటే అన్ని రంగాల్లో ముందుకెళ్లచ్చు.. కానీ దాయాది దేశంగా చూస్తూ నాశనం చేద్దామని చూస్తూ ఆ దేశమే నాశనం అవుతుంది. వియ్యానికైనా.. కయ్యానికైనా.. సమఉజ్జీ ఉండాలి. ఇటీవల పాక్ తో జరిగిన ఆసియా కప్ లో భారత్ కేప్టెన్ అన్న మాట. కేవలం ఉత్తరప్రదేశ్ అంత జనాభా ఉన్న దేశం అంత పెద్ద భారత్ తో పెట్టుకోవడం చూస్తుంటే.. పులి ఎలుక తోక ఊపడమే కదా.. పిల్లి లాంటి బంగ్లాదేశ్ తో పెట్టుకుంటేనే ఆగమయ్యే దేశం పులి లాంటి భారత్ తో పెట్టుకుంటే ఏమవుతుంది. అడుక్కుతినే గతి పడుతుంది.

ఎఫ్ బీఆర్ ఏర్పాటు..

రోజు రోజుకు దిగజారుతున్న తమ ఆర్థిక పరిస్థితిని చూసి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని పాక్ అనుకుంటుంది. ఇది మంచిదే కానీ అందుకు తీసుకుంటున్న చర్యలే చండాలంగా ఉన్నాయి. పాక్ లో ఉన్న జనాభా తక్కువే అందులో కేవలం 2శాతం మంది మాత్రమే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. వీరు కూడా సరైన సమయానికి ట్యాక్స్ కట్టడం లేదు. దీంతో దేశంలో తీవ్రమైన ఆర్థిక లోటు కనిపిస్తోంది. దీనికి తోడు అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా రోజు రోజుకు తగ్గుతోంది. దీని నుంచి బయటపడేందుకు పాక్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇదే 40 మందితో కూడిన ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎఫ్ బీఆర్). ఈ బృందం సెలబ్రెటీలు, ఇన్ ఫ్లూయెన్సర్లు, రియల్ వ్యాపారులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలపై ఒక కన్నేసి ఉంచుతుంది.

తలనొప్పిగా మారిన ఎఫ్ బీఆర్ తీరు..

అయితే ఎఫ్ బీఆర్ ఇన్ ఫ్లూయెన్సర్లకు, సెలబ్రెటీలకు తీవ్ర తలనొప్పిగా మారింది. సోషల్ మీడియాలో లైకుల కోసం టిక్ టాక్, ఇన్ స్టా, యూట్యూబ్ లాంటి ప్లాట్ ఫారాలలో వీడియోలు ఫొటోలు పెట్టడం రివాజుగా మారింది. ఇందులో ఖరీదైన వస్తువులు, నగలు, తదితరాల పెట్టారా.. అంతే సంగతులు ఉదయమే ఈ బృందం ఇంటి ముందు ప్రత్యక్ష్యం అవుతుందట. వెంటనే వారి అకౌంట్లను జల్లడపడతారట. ట్యాక్స్ కడుతున్నారా? ఎగ్గొడుతున్నారా? చూస్తారట. ఒక వేళ ట్యాక్స్ ఎగ్గొడితే వెంటనే కేసులు పెడుతున్నారట. సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో నని ఆ రా తీస్తున్నారట.

పెళ్లి వేడుకను చూసి ఆశ్చర్యం..

ఇటీవల ఈ బృందం ఒక కేసును విశ్లేషించి ఆశ్యర్యపోయిందట. ఒక వ్యాపార వేత్త ఇంట్లో వివాహ వేడుక జరిగిందట. దీని కోసం 8.78 లక్షల డాలర్లను ఖర్చు చేశారట. ఇందులో 2.83 లక్షలు కేవలం నగలు, వజ్రాలు, వైడూర్యాలపై వెచ్చించారట. 1.24 లక్షల డాలర్లు వధువు వేసుకునే దుస్తులకు ఖర్చు చేశారట. కేవలం 400 మంది అతిథులు హాజరైన ఈ వివాహ వేడుకలో ఖరీదైన వింధు వడ్డించడంతో పాటు పూర్తి కార్యక్రమాన్ని హై డెఫనేషన్ డ్రోన్లతో రికార్డు చేశారట. అంతర్జాతీయ కన్సలెంట్లు ఈ వివాహ వేడుక కోసం పని చేశారట. ఈ మొత్తం వివాహ తంతు 6 రోజులు జరిగిందట. దీన్ని చూసి ఎఫ్ బీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

గగ్గోలు పెడుతున్న ఇన్ ఫ్లూయెన్సర్లు

ఎఫ్ బీఆర్ ఏర్పాటును కొందరు మెచ్చుకుంటే.. మరి కొందరు నొచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా యుగంలో ఉన్న తాము కేవలం టిక్ టాక్, ఇన్ స్టా లాంటి వీడియోల ద్వారా సినీ సెలబ్రెటీల కంటే ఎక్కువ ఫేం సంపాదించుకుంటున్నారు. వారు ధరించే నగలు గిల్ట్ అయినా.. తమపై ఎఫ్ బీఆర్ దృష్టి పెడితే పరిస్థితి ఏంటని గగ్గోలు పెడతున్నారు. ఏది ఏమైనా పాక్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ఆ దేశ పౌరులకు మంచిదనే చెప్పవచ్చు.

Tags:    

Similar News