ఒక ఊరికని బయలుదేరితో మరో దేశంలో దింపిన పాక్ ఎయిర్ లైన్స్!

అయితే... ఇలాంటి ఘటన విమాన ప్రయాణం విషయంలో జరిగితే ఎలా ఉంటుంది? తాజాగా పాక్ ఎయిర్ లైన్స్ విషయంలో అదే జరిగింది!;

Update: 2025-07-13 13:30 GMT

సాధారణంగా బస్సుల్లోనూ, రైళ్లలోనూ నిద్రపోయో, మరిచిపోయో గందరగోళానికి గురైన ప్రయాణికులు ఒక చోట దిగల్సింది పోయి మరోచోట దిగిన ఘటనలు చాలానే ఉంటాయి.. ఈ విషయంలో చాలా మందికి స్వానుభవం కూడా ఉంటుందని అంటారు. అయితే... ఇలాంటి ఘటన విమాన ప్రయాణం విషయంలో జరిగితే ఎలా ఉంటుంది? తాజాగా పాక్ ఎయిర్ లైన్స్ విషయంలో అదే జరిగింది!

అవును... ఓ ఊరు వెళ్లాల్సిన ప్రయాణికుడిని, ఇంకో దేశంలోకి తీసుకెళ్లి వదిలేసింది పాక్ ఎయిర్ లైన్స్. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాకిస్థాన్‌ లో లాహోర్‌ నుంచి కరాచీకి బయల్దేరాడు షాజహాన్‌ అనే వ్యక్తి. ఈ సమయంలో స్థానిక ఎయిర్‌ పోర్టుకు చేరుకొని, దేశీయ విమానాలు ఆగే డొమెస్టిక్‌ టెర్మినల్‌ నుంచి లోపలికి ప్రవేశించాడు. కరాచీ వెళుతుందని భావించిన ఓ విమానంలోకి ఎక్కాడు.

ఆ సమయలో అతడు లోపలికి వెళుతున్నప్పుడు సిబ్బందికి టికెట్‌ చూపించాడం, వారు అనుమతించడం.. అతడు లోనికి వెళ్లి కూర్చోవడం అన్నీ టకటకా జరిగిపోయాయి. విమానం ప్రయాణం ప్రారంభించింది. అయితే.. లాహోర్ నుంచి దగ్గరలోనే ఉన్న కరాచీకి 1:45 సమయం పడుతుంది. కానీ.. రెండు గంటలైనా రాకపోయే సరికి అతడికి అనుమానం వచ్చింది.

దీంతో.. సిబ్బందిని పిలిచి రెండుగంటలు దాటినా విమానం కరాచీకి ఎందుకు చేరలేదని ప్రశ్నించాడు. దీంతో కంగుతినడం సిబ్బంది వంతైంది. ఆ తర్వాత కాసేపటికి తేరుకొని ప్రయాణికుడిదే తప్పు అని రివర్స్ లో మొదలుపెట్టారు. ఈ సమయంలో.. కనీసం తనను తిరిగి కరాచీకి చేర్చాలని కోరినా... ఆ ప్రాసెస్ కు మూడ్రోజుల సమయం పడుతుందని చెప్పారు.

అయితే.. లాహోర్ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ కు మరమ్మతులు నిర్వహిస్తుండటంతో డొమెస్టిక్ టెర్మినల్ వద్దే వాటినీ ఉంచడంతో ఏర్పడిన గందరగోళం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు మరోవైపు ఈ విషయంపై స్పందించిన పౌర విమానయాన శాఖ.. సదరు ప్రైవేటు ఎయిర్‌ లైన్స్‌ సంస్థకు భారీగా ఫైన్‌ విధించింది.

Tags:    

Similar News