షాకింగ్... అస్సాంలో ఎమ్మెల్యేతో పాటు ఇంతమంది పాక్ మద్దతుదారులా?

ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడితో భారత్ మొత్తం ఒక్కసారిగా రగిలిపోయిన సంగతి తెలిసిందే.;

Update: 2025-05-24 15:03 GMT

ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడితో భారత్ మొత్తం ఒక్కసారిగా రగిలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో.. ప్రతీకార చర్యగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో.. యావత్ భారత్ సంబరాలు చేసుకుంది! అయితే... ఈ రెండు సంఘటల్లోనూ పూర్తి విభిన్నంగా (పాక్ తరహాలో) ఫీలైన బ్యాచ్ ఒకటి భారత్ లోనే ఉందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది!

అవును... జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆ సంగతి అలా ఉంటే.. మరోపక్క భారత్ లో ఉన్న పాకిస్థాన్ మద్దతుదారుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో అస్సాంలో పెద్ద బ్యాచ్ దొరికింది!

ఇందులో భాగంగా... అస్సాం రాష్ట్రంలో పాకిస్థాన్ మద్దతుదారులపై కొనసాగుతున్న చర్య మరింత ముమ్మరం చేయబడిందని తెలుస్తోంది. ఈ సమయంలో ఆ రాష్ట్రంలో శుక్రవారం పట్టుబడిన ముగ్గురితో కలిపి ఇప్పటివరకూ 76 మంది పాకిస్థాన్ మద్దతుదారులను అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.

శుక్రవారం నల్బరీ, దక్షిణ సల్మారా, కామరూప్ జిల్లాల నుంచి ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్న అనంతరం.. శనివారం ఎక్స్ వేదికా స్పందించిన సీఎం హిమంత... పాకిస్థాన్ మద్దతుదారులపై చర్యలో భాగంగా అస్సాంలో ఇప్పటివరకూ 76 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ప్రతిపక్షీ పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం పేరు కూడా ఉండటం గమనార్హం!

పహల్గాం ఉగ్రదాడి అనంతరం, ఆ దాడిలో పాకిస్థాన్ పాత్రను సమర్ధిస్తూ అమీనుల్ ఇస్లాం ఒక ప్రకటన చేశాడనే ఆరోపణల నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడ ఆయనను దేశద్రోహం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. జాతీయ భద్రతా చట్టం కింద అతన్ని మళ్లీ అరెస్ట్ చేశారు!

దీంతో.. ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని కూడా వేడెక్కించింది. ప్రతిపక్ష పార్టీలు దీన్ని రాజకీయ ప్రతీకారంగా అభివర్ణించాయి. ప్రభుత్వం కావాలనే మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించాయి. దీనిపై స్పందించిన సీఎం.. దేశ ద్రోహుల పట్ల ఎలాంటి దయ చూపబడదని పేర్కొన్నారు.

Tags:    

Similar News