అబీ పిక్చర్ బాకీ.. అంటే.. పీవోకే స్వాధీనమేనా? అసలు సాధ్యమా?
బీజేపీ నాయకులు గత ఏడాది ఎన్నికల సమయంలో ఈసారి గెలిస్తే పీవోకేను స్వాధీనం చేసుకుంటామని పదేపదే ప్రకటనలు చేశారు.;
’ అబీ పిక్చర్ బాకీ.. (పిక్చర్ ఇంకా అయిపోలేదు..)’
పాకిస్థాన్ పై దాడుల అనంతరం ఇదీ ఆర్మీ మాజీ చీఫ్ ల మాట. అంటే, ఈ దాడులు ఇంకా కొనసాగుతాయా? ఎన్ని రోజులు పాటు జరుగుతాయి? ఇంకా ఎక్కడెక్కడ దాడులు చేస్తారు? అసలు పాయింట్ అయిన పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను స్వాధీనం చేసుకుంటారా?
బీజేపీ నాయకులు గత ఏడాది ఎన్నికల సమయంలో ఈసారి గెలిస్తే పీవోకేను స్వాధీనం చేసుకుంటామని పదేపదే ప్రకటనలు చేశారు. ఎన్నికల్లో గెలిచి ఏడాది అయింది కూడా. అయితే, నేరుగా ఏమీ చర్యలు తీసుకోలేదు. అలాంటివారికి పెహల్గామ్ రూపంలో ఓ చాన్స్ దక్కినట్లయింది.
మరి స్వాధీనమేనా?
భారత్ ఈ దాడులకు కొనసాగింపుగా పీవోకేను స్వాధీనం చేసుకుంటుందా? అంటే దానికి కచ్చితంగా ఔనని చెప్పలేం. అయితే, ఇది అంత సులభం కాదు. ఎందుకంటే పాకిస్థాన్ ఎంత బలహీనమైనది అయినా.. మన తరహాలోనే అణు శక్తి దేశం. పీవోకే స్వాధీనం అంటూ జరిగితే పాక్ కూడా ప్రతిఘటిస్తుంది. అది నేరుగా యుద్ధానికి కారణం కూడా అవుతుంది. అదే జరిగితే.. మన ప్రజల ప్రాణాలను, ఇప్పటివరకు మనం సాధిస్తున్న డెవలప్ మెంట్ ను కూడా పణంగా పెట్టినట్లు అవుతుంది.
చైనాతో కూడా యుద్ధం..?
కశ్మీర్ మొత్తం భాగాల గురించి చెప్పాలంటే.. శ్రీనగర్, జమ్ము, లద్దాఖ్, అక్సయ్ చిన్, పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్ బాల్టిస్థాన్. ఇందులో కొంత భాగాన్ని పాక్.. 1963లో చైనాకు ఇచ్చింది.
గిల్గిట్ బాల్టిస్థాన్ పీవోకేలో భాగం కాదు. పీవోకేకు ముజఫరాబాద్ రాజధానిగా ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. గిల్గిట్ బాల్టిస్థాన్.. పాక్ చేతిలో ఉంది.
ఇప్పుడు గనుక మనం పీకేవో స్వాధీనానికి భారత్ ప్రయత్నిస్తే చైనాతో కూడా యుద్ధం తప్పదు. అసలే పీవోకే, పాక్ లో చైనా పెట్టుబడులు పెట్టింది. దీంతో అప్పుడు యుద్ధం మరింత తీవ్ర అవుతుంది.
పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ భారత్ లో చాలామంది పీవోకేను స్వాధీనం చేసుకోవాలని చాలామంది గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ అని గుర్తించాలి.
జమ్ముకశ్మీర్ పూర్తిగా మన ఆధీనంలో ఉండి ఉంటే.. మనకు అఫ్ఘానిస్థాన్ తో కూడా సరిహద్దు ఉండేది.