బీజేపీ మళ్ళీ జమిలి జపం

అయినా సరే ఇపుడు కూడా జమిలి జపం అయితే బీజేపీ వీడడం లేదు. జమిలి ఎన్నికల వల్ల లాభం ఏమిటో జనాలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఏదో రోజుల ఆ విధానం దేశంలో అమలు చేయాలని చూస్తోంది.;

Update: 2025-09-22 04:06 GMT

జమిలి ఎన్నికలు బీజేపీ అజెండాలో ఉంది. దానికి సరైన సమయం కోసం మాత్రమే కుదరాల్సి ఉంది. నిజానికి 2024 ఎన్నికల్లో బీజేపీ కోరుకున్నట్లుగా 400 ప్లస్ ఎంపీ సీట్లు కనుక వచ్చి ఉంటే ఈపాటికి జమిలి విషయంలో చాలా దూకుడుగా ముందుకు సాగేది. అయినా సరే ఇపుడు కూడా జమిలి జపం అయితే బీజేపీ వీడడం లేదు. జమిలి ఎన్నికల వల్ల లాభం ఏమిటో జనాలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఏదో రోజుల ఆ విధానం దేశంలో అమలు చేయాలని చూస్తోంది.

అవగాహన కల్పించడమే :

జమిలి ఎన్నికల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపీ తమ పార్టీ ఎంపీతో దేశంలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మేధావులతో చర్చా గోష్టులు పెడుతోంది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి దివగంత నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె ఎంపీ అయిన బాన్సూరి స్వరాజ్ రాజమండ్రిలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ సదస్సులో పాల్గొన్నారు. ఆమె జమిలి ఎన్నికల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒకేసారి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లయితే, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవడమే కాదు, స్థిరత్వం ఏర్పడుతుందని చెప్పారు. అంతే కాదు ఎన్నికలకు అయ్యే ఖర్చు లక్షల కోట్లతో తగ్గుతుందని ఆమె చెప్పారు.

ప్రజల పన్నులతో ఎన్నికలు :

దేశంలో చూస్తే ఎక్కడో ఒక చోట ఎన్నికలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండటం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆమె అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రజలు పన్నులు రూపంలో కట్టే నిధులు వృథా అవుతున్నాయని ఆమె చెప్పారు. అందుకే ఎన్నికల సంస్కరణలు జరగాలని, జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక మానవ వనరులు కూడా కలిసివస్తాయని ఆమె తెలిపారు. ప్రజల్లో జమిలి ఎన్నికల పట్ల అవగాహన కల్పించడం కోసమే ఇలాంటి సదస్సులు దేశంలో నిర్వహిస్తున్నట్టుగా ఆమె పేర్కొన్నారు.

గొలుసు కట్టు తెగకుండా :

సాధారణంగా జమిలి ఎన్నికలు అంటే కలిగే సందేహాలు ఏమిటి అంటే ఒక అసెంబ్లీకి నెగ్గిన ప్రభుత్వం మధ్యలో కుప్ప కూలితే మళ్ళీ ఎన్నికలు పెడతారు కదా అలా అయిదేళ్ళకు ఆ ప్రభుత్వం వస్తే ఈ జమిలి గొలుసు కట్టి తెగిపోతుంది కదా అన్నది. అయితే దీనికి బాన్సూరి స్వరాజ్ సమాధానం ఇచ్చి కొంత స్పష్టత కలిగించారు. ఒకేసారి కేంద్రానికి రాష్ట్రాలకు జమిలి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఏదైనా కారణం చేత అసెంబ్లీ రద్దు అయితే ఆ మిగిలిన మిగిలిన కాలానికే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. అంటే ఒక శాసన సభ అయిదేళ్ళ పదవీ కాలంలో మధ్యలో రద్దు అయితే మిగిలినది రెండేళ్ళు ఉంటే ఆ కాలానికే మళ్ళీ ఎన్నికలు ఉంటాయన్న మాట. ఇప్పటిదాకా మధ్యంతర ఎన్నికలు వస్తే మరో అయిదేళ్ళ పాటు సభ కాలం ఉండేది. సో ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇదే విధానంలో ఎంపీలు ఎమ్మెల్యేలు మధ్యలో తప్పుకున్నా రాజీనామా చేస్తే కూడా ఎన్నికలు పెడతారు అని అంటున్నారు.

Tags:    

Similar News