బ్రేకప్‌లు..తాత్కాలిక విఫలమా, లేక శాశ్వత నష్టమా?

ప్రభుత్వం, విద్యాసంస్థలు కూడా మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కౌన్సెలింగ్ సెంటర్లు, హెల్ప్‌లైన్ నంబర్లు, అవగాహన కార్యక్రమాలు తప్పనిసరిగా ఉండాలి.;

Update: 2025-09-10 19:30 GMT

దేశంలో లవ్ ఫెయిల్యూర్స్ తో యువత బలవన్మరణాలకు పాల్పడడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రేమ విఫలమవడాన్ని జీవితాంతం ఓటమిగా భావించే తీరు యువతలో పెరగడం ఆందోళనకరం. ఈ దురదృష్టకర పరిస్థితి మన సమాజం, కుటుంబం, విద్యా వ్యవస్థల వైఫల్యాన్నే ప్రతిబింబిస్తోంది.

‘వన్ లైఫ్’ హెల్ప్‌లైన్ ప్రతి సంవత్సరం 23,000కి పైగా కాల్స్ స్వీకరిస్తోంది. వీటిలో పెద్ద సంఖ్యలో వస్తున్న కాల్స్ లవ్ ఫెయిల్యూర్స్ కావడం గమనార్హం.

చిన్నయ సమస్యలు మహా సంక్షోభంగా...

ప్రేమ ఒక సహజమైన భావోద్వేగం. కానీ అది విఫలమైతే జీవితం ముగిసిందన్న భావనతో ముడిపెట్టడం అత్యంత ప్రమాదకరం. మన సమాజం యువతను భావోద్వేగ పరిపక్వత వైపు నడిపించడంలో విఫలమవుతోంది. భావోద్వేగాలను అంగీకరించడం, వైఫల్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం, తిరిగి ముందుకు సాగడం అనే జీవిత పాఠాలను నేర్పించకపోవడంతో చిన్న సమస్యలు కూడా యువత మహా సంక్షోభంగా భావిస్తున్నది.

మొదటి మెట్టు అదే..

ఈ సమస్య పరిష్కారంలో కుటుంబం, స్నేహితులు, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలి. ఒక యువకుడు లేదా యువతి బ్రేకప్ తర్వాత ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే వారిని ఒంటరిగా వదిలేయకుండా మాట్లాడటం, వారి సమస్యలను చెప్పుకున్నడు కాస్తంత సానుభూతి చూపడం, నమ్మకం కల్పించడం అత్యవసరం. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడగల మొదటి మెట్టు ఇదే.

అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి..

ప్రభుత్వం, విద్యాసంస్థలు కూడా మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కౌన్సెలింగ్ సెంటర్లు, హెల్ప్‌లైన్ నంబర్లు, అవగాహన కార్యక్రమాలు తప్పనిసరిగా ఉండాలి. సోషల్ మీడియాలో కూడా యువతను నిస్సహాయత నుంచి బయటకు తీయగల సానుకూలమైన సందేశాలు వ్యాప్తి చెందాలి.

అది అంతిమం కాదు..

ఆత్మహత్య ఎప్పుడూ పరిష్కారం కాదు. అది ఒక క్షణిక భావోద్వేగంలో తీసుకున్న శాశ్వత నష్టం. బ్రేకప్ ఒక తాత్కాలిక విఫలం, కానీ జీవితం శాశ్వతం. ప్రేమలో ఓటమి అనేది జీవనయాత్రలోని ఒక మలుపు మాత్రమే, అంతిమం కాదనేది గ్రహించాలి.

లవ్ ఫెయిల్యూర్స్ సంబంధాలను ముగించవచ్చు, కానీ జీవితాన్ని కాదు.జీవితం విలువైనదని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని యువతకు నమ్మకం కల్పించాలి.

Tags:    

Similar News