బైక్ పై జంట రొమాంటిక్ స్టంట్.. దెబ్బకు రూ.50 వేల ఫైన్.. ఎక్కడంటే?
ఒకప్పుడు ప్రేమ అంటేనే చాలామంది భయపడి పోయేవారు. ముఖ్యంగా ప్రేమించుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని , అదొక నేరంగా భావించే వాళ్లు కూడా.. కానీ పరిస్థితులు మారిపోయాయి.;
ఒకప్పుడు ప్రేమ అంటేనే చాలామంది భయపడి పోయేవారు. ముఖ్యంగా ప్రేమించుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని , అదొక నేరంగా భావించే వాళ్లు కూడా.. కానీ పరిస్థితులు మారిపోయాయి. ఈమధ్య కాలంలో ప్రేమించనిదే వివాహానికి అడుగులు పడడం లేదు. ఒకప్పుడు ఎవరినైనా ఇష్టపడితే ఇంట్లో ఒప్పుకుంటారో లేదో అని భయంతో చాలామంది ఇష్టపడ్డా కూడా బయటకి చెప్పేవాళ్లు కాదు.. ఇంకొంతమంది ఏకంగా ఆ ప్రేమ అనే పదానికే దూరంగా ఉండేవారు.. కానీ కాలం మారుతున్న కొద్ది మనుషులలో కూడా మార్పులు వస్తున్నాయి. చాలామంది ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. అంతెందుకు ఇప్పుడు డేటింగ్ యాప్స్ పేరిట చాలామంది పరిచయం లేకపోయినా.. వీటి ద్వారా అవతలి వ్యక్తితో పరిచయాలు పెంచుకొని.. ఆ తర్వాత సహజీవనం చేసి పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు.
శృతిమించిన ప్రేమికులు..
ఇంకా పెళ్లికి ముందే చేయాల్సినవన్ని చేసేస్తూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో ప్రేమికులు దొంగచాటుగా కలుసుకోవడం అటుంచితే పబ్లిక్ లో తిరుగుతూ బెడ్ రూమ్ లో చేయాల్సిన పనులను పబ్లిక్ గా చేస్తూ అటు సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక జంట రోడ్డుపై చేసిన పనికి ఆ ప్రాంత పోలీసులు గట్టి షాక్ ఇచ్చారని చెప్పాలి. ఇప్పటివరకు రొమాంటిక్ జంటలు రోడ్డుపై ఎన్నో విన్యాసాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరచగా.. ఇప్పుడు మరో ప్రేమికుల జంట కూడా అలాగే చేసి.. చిక్కుల్లో పడింది. మరి ఆ జంట ఏం చేసింది? ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? పోలీసులు వీరికి ఎలాంటి షాక్ ఇచ్చారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
బైక్ పై రొమాంటిక్ స్టంట్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఈమధ్య కాలంలో ఉత్తర ప్రదేశ్ లో ప్రేమికులు ఎలాంటి భయం లేకుండా బైకులపై రొమాన్స్ చేస్తూ రోడ్డుపై ప్రయాణికులకు, చూసేవారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నోయిడాతో పాటు గోరఖ్ పూర్ లో ప్రేమ జంటలు బైకుపై రొమాన్స్ చేస్తూ కెమెరాకు చిక్కారు. తాజాగా ఆ ప్రేమికుడు తన ప్రేయసిని పెట్రోల్ ట్యాంకర్ పై కూర్చోబెట్టుకొని బైక్ డ్రైవ్ చేస్తూ జాలీగా రోడ్డుపై షికారు చేశారు. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు ప్రయాణికులు కూడా ఈ జంట రొమాన్స్ చూసి ఇబ్బంది పడ్డారు.
జంటకు షాక్ ఇచ్చిన నోయిడా పోలీసులు..
దీంతో రంగంలోకి దిగిన నోయిడా పోలీసులు ఈ జంటకు ఏకంగా రూ.53,500 ఫైన్ విధించారు.ఇలా చేస్తే ఇకపై సహించము అని కూడా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో చాలామంది నెటిజన్స్ ఈ జంటపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి పనులు చేయాలో తెలియదా? అని కొంతమంది కామెంట్లు చేస్తే.. ఇంట్లో మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అని ఇంకొంతమంది ఫైర్ అవుతున్నారు. మొత్తానికైతే ఈ జంట చేసిన పని ఇప్పుడు అందరికీ ఆగ్రహాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.