ఏమిటీ ‘నో అజెండా స్పేస్’ ? బెంగళూరులో ఇప్పుడిదో ట్రెండ్

సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేసిన ఒకరు క్రియేట్ చేసిన కాన్సెప్టు ‘నో అజెండా స్పేస్’. ఏమిటీ కాన్సెప్టు అంటే.. ఎలాంటి ఆందోళన.. ఒత్తిళ్లు లేకుండా కాస్తంత టైంను హాయిగా గడిపే ప్రదేశంగా దీన్ని చెప్పాలి.;

Update: 2025-05-05 13:30 GMT

నచ్చినట్లుగా బతకాలి. నచ్చినోళ్లను కలవాలి. రోటీన్ కు భిన్నమైన జీవితాన్ని అస్వాదించాలి. వీటన్నింటితో పాటు.. ఎలాంటి ఒత్తిళ్లు.. ఆందోళన లేకుండా హాయిగా గడిపేందుకు ఒక స్పేస్ ను క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? అందులోనూ అది మహిళలకు మాత్రమే మరెలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి ఆలోచనే చేసిన ఒకరు క్రియేట్ చేసిన కాన్సెప్టు ‘నో అజెండా స్పేస్’. ఏమిటీ కాన్సెప్టు అంటే.. ఎలాంటి ఆందోళన.. ఒత్తిళ్లు లేకుండా కాస్తంత టైంను హాయిగా గడిపే ప్రదేశంగా దీన్ని చెప్పాలి.

ఈ కాన్సెప్టును డిజైన్ చేసింది మేఘనా చౌధురి. ఆడవాళ్ల కోసం క్రియేట్ చేసిన ీ నో అజెండా స్పేస్ లోకి రోజుకు ఇద్దరు నుంచి ముగ్గురు మహిళలు వెళ్లే వీలుంటుంది. అక్కడ వైఫై.. స్నాక్స్.. టీ.. ఇలా కొన్ని ఏర్పాట్లు ఉంటాయి. వంట చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పారు. కావాలంటే పుస్తకాలు కూడా చదువుకోవచ్చు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆ ఇంట్లో ఉచితంగా ఉండే వీలు ఉంటుంది.

విశ్రాంతి తీసుకోవటం.. పుస్తకాలు చదవటం.. పెయింటింగ్ వేసుకోవటం.. ఇలా నచ్చిన పని ఏదైనా ఎవరితో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి రుసుములుచెల్లించాల్సిన అవసరం ఉండదు. మొత్తంగా ఫ్రీగా చేసుకోవచ్చు. అదే సమయంలో మీరెవరు? ఏం చేస్తుంటారు? లాంటి ప్రశ్నల్ని ఎవరూ ఎవరిని వేసుకోరు. నచ్చినట్లుగా ఉండటం కోసం డిజైన్ చేసిన మేఘనా చౌధురి విషయానికి వస్తే ఆమె థెరపిస్టుగా శిక్షణ పొందుతున్నారు. తాను డిజైన్ చేసిన కాన్సెప్టు కోసం తన ఇంటినే వేదికగా మార్చేశారు.

అయితే.. మరి ఆమె ఇంటికి ఎలా వెళ్లాలంటే మాత్రం.. తొలుత లింక్డిన్ ద్వారా ఆమెను సంప్రదించాలి. లేదంటే మొయిల్ చేయాలి. ముందుగా అనుకున్న షెడ్యూల్ టైంకు వెళ్లటం.. అనుకున్నంత సేపు అక్కడ గడిపేసి తిరిగి ఎవరిళ్లకు వారు వెళ్లిపోవటమే. నిజానికి ఈ కాన్సెప్టును తొలుత మరో రూపులో ఉండేది. కొవిడ్ వేళలో.. చాలామంది మహిళలు ఇళ్లల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. కాసేపు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్లాలంటే సాధ్యమయ్యేది కాదు.

అలాంటి వేళలో.. ఇందు ఆంథోని అనే అమ్మాయి ‘మన చోటు’ పేరుతో నమ్మ కట్టే అనే కాన్సెప్టును డిజైన్ చేశారు. పబ్లిక్ ప్లేస్ లో ఉండే ఇక్కడకు నచ్చిన వారు వెళ్లి.. కాసేపు టైం గడిపేసి వెళ్లిపోవచ్చు. ఈ కాన్సెప్టును మరో లెవల్ కు తీసుకెళ్లే పని చేశారు మేఘనా చౌధురి. ఇందుకోసం తన ఇంటినే వేదికగా మార్చేశారు. వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోకుండా.. ఒకరికొకరు సహకరించుకునే ఈ కాన్సెప్టు ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతోంది.

Tags:    

Similar News