చాణక్యుడికే తలదన్నిన నితీష్ వ్యూహాలు!
బీహార్ సీఎం నితీష్ కుమార్ మరో మారు ఆ అత్యున్నత పదవిని అందుకునేందుకు సిద్ధం అవుతున్నారు.;
బీహార్ సీఎం నితీష్ కుమార్ మరో మారు ఆ అత్యున్నత పదవిని అందుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన ఇప్పటికి నాలుగు సార్లు సీఎం గా చేశారు. ఇపుడు ఐదవ సారి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించబోతున్నారు. ఇక ఆయన సీఎం గా పదవీ ప్రమాణ చేయడం ఇది పదవసారి అవుతుంది. ఒక విధంగా రికార్డుగానే చూడాలి. బీహార్ లో నితీష్ కుమార్ కి ఉన్న ఆదరణ ఏమిటి అన్నది తాజా ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. ఆయన మీద ఎన్నికల ముందు ఎంత వ్యతిరేకతను ప్రతిపక్షాలు ప్రచారం చేసినా నితీష్ ని జనాలు గెలిపించారు. నితీష్ కూడా తనదైన వ్యూహాలతో అపర చాణక్యుడు అనిపించుకున్నారు.
చంద్రబాబు సరిసాటి :
నితీష్ కుమార్ చాణక్యం చంద్రబాబు సరి సాటిగా కూడా ఇపుడు అంతా అంటున్నారు. ఆయన చాలా సైలెంట్ గానే ఉంటూ పొలిటికల్ గా తాన్ ఎంత దూకుడు చేస్తానో రుజువు చేసి చూపించారు. ఏపీకి నాలుగు సార్లు బాబు సీఎం అయితే నితీష్ అయిదవసారి సీఎం గా అవుతున్నారు అలా బాబు రికార్డులు ఆయన బ్రేక్ చేయనున్నారు. నితీష్ కి పాలన మీద పట్టు తప్పిందని ఆయన మానసికంగా శారీరకంగా అలసిపోయారు అని ప్రత్యర్ధులు చేసిన విమర్శలను ఒంటి చేతిలో ఎదుర్కొని బీహార్ సీఎం అంటే తానే అని మరోసారి చాటుకున్నారు.
జేడీయూ ప్రభంజనం :
బీహర్ అసెంబ్లీ చరిత్రలో ఎన్డీయే కొత్త రికార్డులు సాధిస్తూంటే నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ సైతం ప్రభంజనమే సృష్టిస్తోంది. ఆ పార్టీ మొత్తం 101 సీట్లకు పోటీ చేస్తే అందులో 80 పై దాటి సీట్లో జేడీయూ లీడ్ లో ఉండడం అంటే గ్రేట్ అని చెప్పాల్సిందే. అంతే కాదు పోటీ చేసిన ప్రతీ చోటా జేడీయూ అభ్యర్థులు మంచి ఆధిక్యంలో ఉండడం కూడా విశేషం. ఇక జేడీయూ రెండు దశాబ్దాలుగా పాలిస్తోంది. దాని వల్ల యాంటీ ఇంకెంబెన్సీ ఉందని అంతా అనుకున్నారు. కానీ వాటిని పటాపంచలు చేస్తూ జేడీయూ దూసుకుని పోవడంతో నితీష్ కుమార్ చరిష్మా ఏమిటి అన్నది అందరికీ అర్ధం అవుతోంది.
పవర్ ఫుల్ స్లోగన్ :
ఇక నితీష్ కుమార్ విషయంలో టైగర్ అభీ జిందా హై ఒక బలమైన నినాదంగా పనిచేసింది. రాష్ట్ర రాజధాని పాట్నా సహా రాష్ట్ర వ్యాప్తంగా టైగర్ అభీ జిందా హై అనే నినాదంతో జేడీయూ ఉర్రూతలూపింది. నితీష్ వయసు చూస్తే ఏడున్నర పదులు ఆయనకు పాలన మీద పట్టు లేదని విమర్శలు వచ్చినా తన చాణక్యం తో అద్భుతమైన విజయం సాధించి తిరుగులేదు అనిపించుకున్నారు. తనది పండిన రాజకీయ అనుభవం అని ప్రత్యర్ధులకు ఆయన చాటరు.
ప్రమాణం తేదీ :
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ ఈ నెల 15 లేదా 18 తేదీలలో సీఎం గా ప్రమాణం చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. నిజానికి 18 అన్నది లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ ఎంచుకున్న ముహూర్తం. కానీ నితీష్ కే సీఎం పీఠం అని జనాలు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో ఆ డేట్ న నితీష్ మరోసారి సీఎం అవుతారు అని అంటున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా ఉండేలా చూస్తున్నారు.