ఎన్డీయే గెలిచినా నితీష్ కి ఛాన్స్ ఎంతవరకు ?

ఇక బీహార్ లో ఎవరు సీఎం అవుతారు అన్నది కొత్త చర్చగా ముందుకు వస్తోంది. ఎన్డీయే గెలిస్తే నితీష్ కుమార్ సీఎం అని అంతా అనుకుంటున్నారు.;

Update: 2025-11-11 15:40 GMT

బీహార్ సీఎం గా గత రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ పాలిస్తున్నారు. మధ్యలో కొన్ని నెలలు తప్ప 2005 నుంచి ఆయనే బీహార్ సీఎం గా ఉన్నారు. 2020లో ఎన్డీయే కూటమితో జత కట్టి నితీష్ సీఎం అయ్యారు. ఈసారి కూడా ఆయన ఎన్డీయేతో కలిసే ఎన్నికలకు వెళ్ళారు. అయితే ఈసారి ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి నితీష్ మళ్ళీ సీఎం కారు అని విపక్షం ప్రచారం చేస్తూ వచ్చింది. అంతే కాదు రాజకీయ విశ్లేషణలు అలాగే వెలువడ్డాయి. ఇక చూస్తే మంగళవారంతో రెండవ విడత పోలింగ్ ముగిసింది. ఈ నెల 14న ఫలితాలు రానున్నాయి.

వార్ వన్ సైడేనా :

ఇలా పోలింగ్ ముగిసిందో లేదో ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఒక్కోటిగా బయటకు వచ్చాయి. బీహార్ లో ఎవరు అధికారం చేపడతారు అన్నది చూస్తే కనుక ఎన్డీయేకే అవకాశాలు అన్నీ దాదాపుగా అనేక సర్వే ఏజెన్సీలు గట్టిగానే చెప్పేశాయి. ఒక విధంగా చెప్పాలీ అంటే వార్ వన్ సైడ్ గా సాగింది అని అంటున్నారు. మహా ఘట్ బంధన్ ఈసారి తప్పకుండా పవర్ లోకి వస్తుందని భావించినా ఏ ఒక్క సర్వే కూడా అధికారంలోకి దరిదాపుల్లోకి వస్తుందని తేల్చి చెప్పలేదు. దాంతో ఎన్డీయే గెలుపు ఖాయమని ప్రచారం ఊపందుకుంది.

కొత్త చర్చ :

ఇక బీహార్ లో ఎవరు సీఎం అవుతారు అన్నది కొత్త చర్చగా ముందుకు వస్తోంది. ఎన్డీయే గెలిస్తే నితీష్ కుమార్ సీఎం అని అంతా అనుకుంటున్నారు. కానీ బిగ్ ట్విస్ట్ ఏమైనా ఉంటుందా అన్నదే ఇపుడు హాట్ డిబేట్ కి కారణం. బీజేపీ అయితే బీహార్ సీఎం పదవి మీద కన్నేసింది అని చాలా కాలంగా చెబుతున్నారు. ఆ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కీలకంగా ఉన్నారు. ఆయన బీహార్ ఎన్డీయేలో అత్యంత ముఖ్య పాత్ర సైతం పోషిస్తున్నారు. పేరు చెప్పకపోయినా ఆయననే బీజేపీ ప్రొజెక్ట్ చేస్తూ వస్తోంది. ఎన్డీయే ఎన్నికల మ్యానిఫేస్టో సైతం నితీష్ కుమార్ తో కలసి ఆయన ఆవిష్కరించారు. దాంతో ఆయనకు అవకాశాలు ఉన్నాయా అన్నదే కొత్త చర్చ.

జేడీయూ బెటర్ పొజిషన్ :

అయితే ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే కనుక గతం కంటే ఎన్డీయేకు ఎక్కువ సీట్లు వస్తాయని తేల్చాయి. అందులో బీజేపీతో పాటు జేడీయూ సైతం మంచి పర్ఫార్మెన్స్ చేసిందని కనిపిస్తోంది. ఆ విధంగా విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే ఈ సర్వేలలో పేర్కొన్న మేరకు ఎన్డీయేకు 160 సీట్ల దాకా వస్తే మాత్రం నితీష్ కుమార్ సీఎం కాకపోవచ్చు అని అంటున్నారు. అపుడు బీజేపీకి చెందిన వారే సీఎం గా ఉంటారు అని అంటున్నారు. జేడీయూలో కొంత అసంతృప్తి ఉన్నా దానిని దాటుకుని ముందుకు వెళ్ళే సంఖ్యా బలం ఎన్డీయేకు ఈ లార్జ్ నంబర్ తో ఉంటుందని అంటున్నారు. అలా కాకుండా నంబర్ ఏ 130 దగ్గరలో ఆగిపోతే మాత్రం నితీష్ కుమార్ కి చాన్స్ రావచ్చు అన్నది మరో చర్చ. మొత్తానికి చూడాల్సి ఉంది. ఎన్డీఎ గెలిస్తే కనుక నితీష్ కుమార్ సీఎం అవుతారా లేక కొత్త సీఎం వస్తారా అన్నది.

Tags:    

Similar News