నితీష్ త్యాగాలు స్టార్ట్...ఇంకా ఎన్ని చేయాలో ?

బీహార్ సీఎం గా ఐదవసారి నితీష్ కుమార్ గద్దెనెక్కారు. అంత వరకూ సంతోషమే. కానీ ఆయన పార్టీకి చెందిన వారి కంటే బీజేపీకి చెందిన వారికే ఎక్కువ మంత్రి పదవులు దక్కాయి.;

Update: 2025-11-22 03:56 GMT

బీహార్ సీఎం గా ఐదవసారి నితీష్ కుమార్ గద్దెనెక్కారు. అంత వరకూ సంతోషమే. కానీ ఆయన పార్టీకి చెందిన వారి కంటే బీజేపీకి చెందిన వారికే ఎక్కువ మంత్రి పదవులు దక్కాయి. అంతే కాదు కీలక పోర్టు ఫోలియోలు వారికే ఇవ్వాల్సి వస్తోంది. నితీష్ కుమార్ సీఎం గా ఉన్నారు కానీ బీజేపీకి చెందిన వారు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వారు ఒకరు సామ్రాట్ చౌదరి, రెండవ వారు విజయ్ కుమార్ సిన్హా.

హోం శాఖ త్యాగం :

నితీష్ కుమార్ 2005 నుంచి బీహార్ సీఎం గా ఉంటూ వస్తున్నారు. ఆయన హోం శాఖను మాత్రం ఎవరికీ ఇవ్వకుండా తన వద్దనే ఉంచుకునేవారు. బీహార్ లో లా అండ్ ఆర్డర్ అంతా జాగ్రత్తగా చూసేందుకే ఆయన ఈ కీలకమైన పోర్టు ఫోలియోను తానే తీసుకునేవారు. అలాంటిది ఇపుడు ఈ శాఖను నితీష్ ఫస్ట్ టైం వదులుకున్నారు. తన వద్ద గతంలోనూ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నా సామ్రాట్ చౌదరికి హోంశాఖ కేటాయింపు చేశారు నితీష్ కుమార్. అలాగే మరో కీలకమైన రెవిన్యూ శాఖను బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హాకు కేటాయించారు. దాంతో సీఎం నితీశ్ కుమార్ వద్ద సాధారణ పరిపాలన విభాగం, క్యాబినెట్ సెక్రటరియేట్, విజిలెన్స్ శాఖలు వంటి శాఖలు మాత్రమే ఉన్నాయి.

ఆర్ధిక శాఖ ఇటు :

అయితే బీజేపీ ఎపుడూ తీసుకునే ఆర్ధిక శాఖ ఈసారి జేడీయూకి దక్కింది. జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌కు ఆర్థిక శాఖ కేటాయింపు చేశారు. కానీ ఆర్ధిక శాఖ తలనొప్పిగా కూడా ఎపుడూ ఉంటుంది. ఈసారి కూడా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఈ శాఖ చాలా ఒక సవాల్ గా మారనుంది అని అంటున్నారు.

స్పీకర్ కూడా :

ఇంకో వైపు చూస్తే స్పీకర్ కూడా బీజేపీకి చెందిన వారే ఉండబోతున్నారు అని అంటున్నారు. దాంతో నితీష్ కుమార్ ఎన్డీయే సారధిగా ఉన్నా మొత్తం అజమాయిషీ అంతా బీజేపీదే అని అంటున్నారు. డెబ్బై అయిదేళ్ళ వయసులో ఉన్న నితీష్ అయిదేళ్ళూ సీఎం గా బీహార్ కి కొనసాగుతారా అంటే బీజేపీ వేసే ఎత్తుల మీదనే అది ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. నితీష్ కుమార్ అవారం ఇపుడు కేంద్రంలో ప్రభుత్వానికి ఉంది. అది ఒక్కసారి తీరిపోయాక అపుడు అసలు కధ మొదలవుతుంది అని అంటున్నారు వీటి కంటే ముందుగానే నితీష్ కుమార్ త్యాగాలు స్టార్ట్ అయిపోయాయి అని అంటున్నారు దాంతో రానున్న కాలంలో ఆయన ఇంకెన్ని త్యాగాలకు సిద్ధపడాలో అన్న చర్చ అయితే వస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News