సీఎం గా నితీష్ కొత్త రికార్డు

బీహార్ సీఎం గా ఐదవసారి నితీష్ కుమార్ గురువారం ప్రమాణం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా హాజరయ్యారు.;

Update: 2025-11-20 15:30 GMT

బీహార్ సీఎం గా ఐదవసారి నితీష్ కుమార్ గురువారం ప్రమాణం చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంతా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదవీ ప్రమాణం చేయడం ఇది పదవసారి ఆ విధంగా కూడా ఆయన సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. అంతే కాదు దేశంలో ఎక్కువ కాలం పాలించిన పది మంది సీఎంల జాబితాలో నితీష్ చేరిపోయారు రెండున్నర దశాబ్దాలకు పైగా ఈ దేశాన్ని పాలించిన ముఖ్యమంత్రులు ఉన్నారు. వరసబెట్టి గద్దె దిగకుండా సీఎం సీటులో ఉన్న వారూ ఉన్నారు. ఇపుడు నితీష్ కూడా వారి సరసన చేరారు అన్న మాట.

నితీష్ ప్రస్థానం :

ముఖ్యమంత్రిగా నితీష్ 2000 మార్చి 3 నుంచి మార్చి 10 వరకూ తొలిసారి ముఖ్యమంత్రిగా బీహార్ కి పనిచేశారు. అలా ఆయన కేవలం ఏడు రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు. మెజారిటీ లేక రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక 2005లో రెండోసారి ఆయన సీఎం అయినది ఇదే నవంబర్ నెల 24వ తేదీన అన్న మాట. అలా ఆయన 2010 నవంబర్ 24 దాకా ఫుల్ టెర్మ్ సీఎం గా చేశారు ఇక 2010 నవంబరు 26 మూడవసారి సీఎం గా ప్రమాణం చేసి - 2014 మే 17 దాకా అదే చెయిర్ లో ఉన్నారు. ఈ మధ్యలో 2015 ఫిబ్రవరి 22 దాకా ఆయన పదవికి దూరంగా ఉండి మాంజీని ముఖ్యమంత్రిగా చేశారు. అది ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన సామాజిక సమీకరణ కోసం మాంజీని తెచ్చి సీఎంని చేశారు అన్నది కూడా ఉందని అంటారు. తిరిగి ఫిబ్రవరి 20న మరోసారి సీఎం గా ప్రమాణం చేసి 2015 నవంబర్ లో జరిగే ఎన్నికల దాకా కొనసాగారు.

ఆర్జేడీతో కలసి :

ఇక 2015 నవంబరు 20న ఆయన సీఎం గా ప్రమాణం చేశారు. అప్పట్లో ఆర్జేడీతో కలసి ప్రభుత్వం నడిపారు. ఈ పొత్తుకు మధ్యలోనే బ్రేక్ ఏర్పడింది. దాంతో 2017 జూలై 26 రాజీనామా చేసి ఎన్డీయేతో కలసి ఆయన 2017 జూలై 27 మరోసారి సీఎం గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలా 2020 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే తో కలసి ఆయన ఎన్నికలకు వెల్ళి మరోసారి సీఎమయ్యరు అయితే 2022 ఆగస్టు 10 ఆయన ఎన్డీయే నుంచి విడిపోయి ఇండియా కూటమితో చేతులు కలిపి సీఎం అయ్యారు అలా ఆయన 2022 ఆగస్టు 10 నుంచి 2024 జనవరి 28 దాకా ఇండియా కూటమిలో ఉన్నారు. ఇక 2024 జనవరి 28 తిరిగి ఎన్డీయే గూటికి వచ్చి 2025 నవంబర్ 19 దకా ఆ ప్రభుత్వాన్ని నడిపారు. ఇపుడు తాజాగా జరిగిన ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టి మరోసారి ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

అసలైన రికార్డు :

నితీష్ కుమార్ ఎవరూ చేయలేని విధంగా ప్రమాణాలు పది సార్లు సీఎం గా చేసి అసలైన రికార్డుని సాధించారు అని చెప్పాలి. అవి వరసగా 2000, 2005, 2010, 2015 ఫిబ్రవరి, 2015 నవంబర్, 2017 జూలై, 2020 నవంబర్, 2022 ఆగస్టు, 2024 జనవరి, 2025 నవంబర్ దాకా. ఇలా చూస్తే బీహార్ సీఎం గా పది సార్లు ప్రమాణం చేసిన చరిత్ర పుటలలో పదిలంగా ఉంది.

Tags:    

Similar News