మోడీ లేకపోతే బీజేపీకి గుండు సున్నాయే !
అవునా నిజమా అంటే బీజేపీకి చెందిన మెజారిటీ నేతల భావన అలాగే ఉంది అని అంటున్నారు.;
అవునా నిజమా అంటే బీజేపీకి చెందిన మెజారిటీ నేతల భావన అలాగే ఉంది అని అంటున్నారు. అందులో కొందరు బయటకు వచ్చి తమ భావాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మౌనంగానే ఉంటున్నారు. నిజానికి చూస్తే కనుక బీజేపీ కాదు కానీ రాజకీయ విశ్లేషకుల మాటలు చూసినా తటస్థులు చెప్పేది చూసినా బీజేపీకి ఈ వైభవం ప్రాభవం మోడీ వల్లనే అని ఒప్పుకుంటారు.
మోడీని చాణక్యుడు అని అందుకే అంటారు. ఆయన వ్యూహాలు పదునుగా ఉంటాయి. దాంతో ఆయన ఏదో ఒకటి మోడీజాలం చేసి మరీ బీజేపీకి మూడు సార్లు అధికారాన్ని కేంద్రంలో అందించారు. మామూలుగా చూస్తే ఇది ఆషామాషీ విషయం కానే కాదు. కాంగ్రెస్ కే వరసగా మూడు సార్లు అధికారం అన్నది శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలోనే సాధ్యపడలేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలి నాళ్ళలో నెహ్రూ వంటి మహా నేత ఉండడం పెద్దగా పోటీ లేకపోవడం వల్లనే మొదట్లో సాధ్యపడింది అని గుర్తు చేస్తున్నారు.
అలాంటి మ్యాజిక్ ని ఇంత పోటీ రాజకీయంలో రిపీట్ చేసిన మోడీని మాజీ ప్రధాని చేద్దామని కొందరు అనుకుంటున్నారు అంటున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాటలే మంట పుట్టించాయని అంటున్నారు. 75 ఏళ్ళు నిండిన వారు అంతా రాజకీయాల నుంచి హుందాగా తప్పుకోవాలని ఆయన అన్న మాటల నేపధ్యంలో మోడీ గద్దె దిగిపోతారా అన్న చర్చ సాగుతూనే ఉంది.
అయితే ఇది తప్పు అలా జరిగితే బీజేపీ పుట్టె మునగడం ఖాయమని జార్ఖండ్ ఎంపీ నిషికాంత్ దూబే అంటున్నారు ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో బోల్డ్ గా మాట్లాడి బోలెడు విషయలు చెప్పేశారు. మోడీ లేకపోతే బీజేపీ తన మనుగడ కొనసాగించలేదు అని కూడా చెప్పి కుండబద్ధలు కొట్టేశారు. ఈ రోజే కాదు మరో పదిహేను ఇరవై ఏళ్ళ పాటు బీజేపీ అధికారంలో ఉండాలన్నా విజయాలు చూడాలన్నా మోడీ నాయకత్వమే శరణ్యం అని కూడా ఆయన అన్నారు.
మోడీ లేకుంటే బీజేపీకి దక్కేవి కేవలం 150 సీట్లు మాత్రమే అని కూడా సర్వే నివేదికను ఇచ్చేశారు. ఢిల్లీ ఖాలీగా లేదు, పీఎం పీఠం అంతకంటే ఖాళీగా లేదు అని ఆయన చెబుతున్నారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ ప్రధాని రేసులో ఉంటారు అని వార్తలు వస్తున్న క్రమంలో ప్రధాని నాయకత్వంలో మార్పు ఉండదని కూడా స్పష్టత ఇచ్చేశారు
మరో నాలుగేళ్ళలో అంటే 2029లో జరిగే లోక్ సభ ఎన్నికలు కూడా మోడీ నాయకత్వంలోనే బీజేపీ ఎదుర్కొంటుందని ఆయన అంటున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో దూబే విభేదిచారు. మోడీకి బీజేపీ అవసరం లేకపోవచ్చు. కానీ బీజేపీకి మాత్రం మోడీ అవసరం చాలానే ఉంది అని అంటున్నారు. ఎవరు అవును అన్నా కాదన్నా ఇదే నిజమని దూబే స్పష్టంగా చెప్పారు. రాజకీయ పార్టీలు బలమైన నాయకత్వంలోనే మనుగడ సాగిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక విషయంలో జరుగుతున్న జాప్యం మీద దూబే మాట్లాడుతూ చాలా సంక్లిష్టమైన విషయాలు సమస్యలు ఈ విషయంలో ఇమిడి ఉన్నాయని చెప్పడం విశేషం. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలౌ బలమైన వ్యతిరేకమైన గొంతునే ఎంపీ దూబే వింపించారు. మరి మిగిలిన వారి వంతు ఎపుడో చూడాల్సిందే.