లోకేష్ కంటే ముందు ఆయనకే పదవి ?

లోకేష్ కి కీలక పదవి ఇవ్వాలని కూడా మహనాడులో సీనియర్ల నుంచి జూనియర్ల దాకా ఒకే డిమాంద్ గా వినిపించింది.;

Update: 2025-06-02 22:30 GMT

తెలుగుదేశం పార్టీని గత మూడు దశాబ్దాలుగా ఒంటి చేత్తో నడిపిస్తున్న చంద్రబాబు ఈసారి పార్టీ బాధ్యతలను చాలా వరకూ కుమారుడు లోకేష్ భుజాన పెట్టనునారు. ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది.

లోకేష్ కి కీలక పదవి ఇవ్వాలని కూడా మహనాడులో సీనియర్ల నుంచి జూనియర్ల దాకా ఒకే డిమాంద్ గా వినిపించింది. నిజానికి ఈ పదవి లోకేష్ ఇస్తారని చాలా కాలంగా అనుకుంటున్న సంగతే. ఈ పదవి కనుక లోకేష్ కి అప్పగిస్తే చంద్రబాబు పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల మీఅద్ నిమగ్నం అవుతారని ఆయన పూర్తిగా ప్రభుత్వం మీద ఫోకస్ పెడతారని అంతా అంటున్నారు.

ఇక చంద్రబాబు మరోసారి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నెగ్గారు. దాంతో ఆయన ఇపుడు టీడీపీ లో కీలక పదవులు మార్పులు కూర్పుల మీద దృష్టి పెట్టారని అంటున్నారు. చాలా మంది అనుకుంటున్నట్లుగా నారా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి అక్కడ నుంచి శ్రీకారం చుట్టకుండా కొత్త ఎత్తులలో బాబు ఉన్నారని అంటున్నారు.

ఆయన తన కుమారుడికే కీలక పదవి ఇచ్చుకున్నారని అన్న మాట రాకుండా ఉండేందుకు ముందుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని పొలిట్ బ్యూరోలోకి తీసుకుంటారు అని అంటున్నారు. ఆ విధంగా యువకుడు బలమైన బీసీ నేతగా ఉన్న రామ్మోహన్ ని ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంటుందని ఆలోచన చేస్తున్నారుట.

ఆ తరువాతనే లోకేష్ కి కీలక పదవి దక్కుతుందని అంటున్నారు. లోకేష్ కి టీడీపీలో ప్రాధాన్యత ఇస్తూనే కింజరాపు ని కూడా ఆయన పక్కనే ఉంచే ఏర్పాటు చేస్తున్నారు అని అంటున్నారు. దాని వల్ల బీసీల పార్టీగా టీడీపీకి ఉన్న ముద్ర చెదిరిపోకూడని భావిస్తున్నారుట.

పైగా రామ్మోహన్ విద్యాధికుడు, చురుకైన నాయకుడు, మంచి వక్త పార్టీకి వీర విధేయుడిగా ఉన్నారు. దాంతో పాటు తనకు అప్పగించిన కేంద్ర పౌర విమానయాన శాఖను ఆయన విజయవంతంగా నిర్వహిస్తున్నారని అంటున్నారు.

లోకేష్ యువ బృందంలో నంబర్ టూ గా రామ్మోహన్ ని చెబుతున్నారు. లోకేష్ కి ఫ్యూచర్ లో తోడుగా అండగా ఉండేలా రామ్మోహన్ ని ఇప్పటి నుంచే ముందుకు తీసుకుని వస్తున్నారు అని అంటున్నారు. ఇక మహానాడు బాధ్యతలు కూడా రమమోహన్ కి అప్పగిస్తే ఆయన విజయవంతంగా పూర్తి చేసారు అని అంటున్నారు. ఇవన్నీ చూసిన మీదటన లోకేష్ కంటే ముందే ఆయనకు పార్టీలో కీలక స్థానం దక్కుతుందని అంటున్నారు.

అంతే కాదు లోకేష్ బృందంలోని కీలకమైన వారికి కూడా పొలిట్ బ్యూరోలో స్థానం దక్కుతుందని అంటున్నారు. అలా ఒక సమర్ధవంతమైన యువ బృందాన్ని పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం ద్వారా టీడీపీకి తాజాదనం తేవడంతో పాటు లోకేష్ భవిష్యత్తు నాయకత్వాన్ని బలోపేతం చేయాలన్న ఆలోచన టీడీపీ అధినాయకత్వం మీద ఉంది అని అంటున్నారు.

ఇపుడున్న పరిస్థితులు చూసుకుంటే ఉత్తరాంద్రాలో కింజరాపు రామ్మోహన్ నాయుడు తిరుగులేని నాయకుడిగా టీడీపీలో అవతరించనున్నారు అని అంటున్నారు. అంతే కాదు లోకేష్ ఫ్యూచర్ లో నంబర్ వన్ అయితే రామ్మోహన్ నంబర్ టూగా ఉంటారని కూడా చెబుతున్నారు. నిజంగా టీడీపీ అధినాయకత్వం వద్ద అంత నమ్మకం పెంచుకున్న రామ్మోహన్ నాయుడు దక్ష్తను అంతా మెచ్చుకుంటున్నారు.

Tags:    

Similar News