కొత్త నేతలకు ఇచ్చిపడేసిన లోకేష్
టీడీపీలో కొత్త నాయకులకు మంత్రి నారా లోకేష్ క్లాస్ ఇచ్చేశారు. పార్టీ లైన్లు, పార్టీ సిద్ధాంతాలను విస్మరిం చిన వారిని, దుందుడుకుగా వ్యవహరిస్తున్నవారికి ఆయన తాజాగా గీతోపదేశం చేశారు.;
టీడీపీలో కొత్త నాయకులకు మంత్రి నారా లోకేష్ క్లాస్ ఇచ్చేశారు. పార్టీ లైన్లు, పార్టీ సిద్ధాంతాలను విస్మరిం చిన వారిని, దుందుడుకుగా వ్యవహరిస్తున్నవారికి ఆయన తాజాగా గీతోపదేశం చేశారు. ఇదేసమయంలో పార్టీని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరాన్ని కూడా సోదాహరణంగా వివరించారు. అయితే.. ఆయన ఎవరినీ ప్రత్యకంగా పిలవలేదు. కేవలం అందుబాటులో ఉన్న నాయకులతోనే.. ఉండవల్లిలోని తన క్యార్యాలయంలో మాట్లాడారు.
గత ఎన్నికలకు ముందు పార్టీ ఎన్నో ఇబ్బందులు పడిందన్న నారా లోకేష్.. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. 75 ఏళ్ల వయసులో కూడా సీఎం చంద్రబాబు రాష్ట్రం కోసం ఎంత తపిస్తున్నారో.. చూడాలని.. ఆయనలాగా కాకపోయినా.. మీ మీస్థాయిలో అయినా.. ప్రజలకు సేవ చేయాలన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన వారిపై పార్టీకి, ప్రజలకు కూడా చాలానే ఆశలు ఉన్నాయన్న నారా లోకేష్.. కానీ, వారు అలా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో సీనియర్లు.. జోక్యం చేసుకుని పార్టీ నేతలకు... సిద్ధాంతాలు, పద్ధతులు కూడా నేర్పించాల ని సూచించారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని పెట్టుబడులు తెస్తున్నామని, విధ్వంసం అయిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సులో 10 లక్షల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరగనున్నాయని వివరించారు. వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందన్నారు.
అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా ప్రజలకు వివరించాలని నారా లోకేష్ సూచిం చారు. అదేవిధంగా మంత్రులు కూడా పెట్టుబడుల కల్పనపై దృష్టి పెట్టాలన్న ఆయన ఇప్పటికే రాబట్టి న పెట్టుబడులను సాకారం అయ్యేలా చూడాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందన్నారు. అదేసమయం లో పెట్టుబడుల కల్పనతో వచ్చే ఉపాధి, ఉద్యోగాల విషయాన్ని ప్రజల మధ్యకు కూడా తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.