మాస్టర్ బ్లాస్టర్ ను కలిసిన లోకేశ్.. కారణం ఇదేనా..?

ఆంధ్రప్రదేశ్ యంగ్ లీడర్.. నారా లోకేశ్ కు క్రికెట్ అంటే చాల అభిమానం. చాలా సందర్భాల్లో ఆయన క్రికెట్ తన ఫెవరేట్ స్పోర్ట్స్ అని చెప్పాడు.;

Update: 2025-11-19 05:30 GMT

ఆంధ్రప్రదేశ్ యంగ్ లీడర్.. నారా లోకేశ్ కు క్రికెట్ అంటే చాల అభిమానం. చాలా సందర్భాల్లో ఆయన క్రికెట్ తన ఫెవరేట్ స్పోర్ట్స్ అని చెప్పాడు. అలాగే వీలు దొరికినప్పుడల్లా క్రికెటర్లను కలుస్తుంటాడు. ఇక వారిని గౌరవించాల్సి వస్తే ఛాన్స్ వదులుకోడు.. మొన్న వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ ఉమెన్ టీం క్రికెటర్లను ఆయన కలిసి అభినందించారు. క్రికెట్‌ అంటే ప్రత్యేక అభిరుచి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఐటీ మంత్రి నారా లోకేష్‌ మరోసారి తన క్రికెట్ ప్రేమను చూపించారు. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూడడం, ఆటగాళ్లతో కలవడం. ఆయనకు ఇవన్నీ కొత్తేమీ కాదు. ఆ అవకాశం లభించిన ప్రతిసారీ లోకేష్‌ వదులుకోరు.

సాయిబాబా శతజయంతి వేడుకల్లో..

అటువంటి సందర్భంలోనే బుధవారం (నవంబర్ 20, 2025) లోకేష్‌ క్రికెట్ చరిత్రలోనే గొప్ప ఆటగాడిగా గుర్తింపు పొందిన సచిన్‌ టెండూల్కర్‌ను అనంతపురంలో కలిశారు. సచిన్‌ పుట్టపర్తి, అనంతపురం జిల్లాకు వచ్చి రేపు జరగనున్న సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భాన్ని లోకేష్‌ వినియోగించుకున్నారు.

స్నేహపూర్వకంగా సాగిన భేటీ..

లోకేష్ సచిన్ భేటీ పూర్తిగా స్నేహపూర్వక వాతావరణంలో సాగినట్లు తెలుస్తోంది. క్రికెట్‌ అభివృద్ధి, ఆటలో వచ్చిన పరిణామాలు, సచిన్‌ తన కెరీర్‌లోని గుర్తుండిపోయే క్షణాలు ఇవన్నీ వారి చర్చలో భాగమయ్యాయి. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో యువ క్రీడాకారులకు అందిస్తున్న అవకాశాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ గురించి కూడా ఇద్దరు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా జీవితం, బోధనలు, సేవా విలువలపై కూడా లోకేష్‌ సచిన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. ‘సాయిబాబా శతజయంతి సందర్భంలో ఆయన చూపిన మానవతా మార్గం గురించి కూడా మేము చర్చించాం’ అని లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం సందర్శనలో భాగంగా జరిగిన ఈ భేటీ, క్రికెట్ అభిమానులకు మరియు రాష్ట్ర క్రీడాభివృద్ధి పై ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేకంగా నిలిచింది.

Tags:    

Similar News