సర్కార్ ఖర్చులతో లోకేష్ విమాన ప్రయాణాలు ?
ఇక లోకేష్ మంత్రిగా ప్రభుత్వంలో అతి ముఖ్య స్థానంలో ఉన్నారు. ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చేందుకు విదేశాలకు వెళ్తున్నారు. అలా ఆయన ఆస్ట్రేలియా సింగపూర్ వంటి దేశాలకు కూడా వెళ్ళారు.;
మంత్రి నారా లోకేష్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. అలాగే విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఆయన ప్రభుత్వం సొమ్ముని పూర్తిగా వాడేసుకుంటున్నారు అని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. అంతే కాదు లోకేష్ ఖర్చులు అధికంగా సర్కార్ వారి ఖాతా నుంచే తీసుకుంటున్నారు అని వైసీపీ విమర్శలు చేస్తూ వస్తోంది. అయితే ఇందులో నిజమెంత అన్నది చూడాల్సిన అవసరం అయితే విమర్శించే వారికి లేదు కానీ తెలుసుకోవాలన్న ఆలోచన అయితే సగటు జనాలకు ఉంది. అందుకే సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తి అడిగిన దానికి సంబంధించి వివరాలను ప్రభుత్వం అందించింది. దాని ప్రకారం చూస్తే లోకేష్ ఖర్చులు ఏ విధంగా పెడుతున్నారు, ప్రభుత్వం నుంచి ఆయన ఏమి తీసుకుంటున్నారు అన్నది పూర్తిగా వెల్లడి అయింది.
ఒక్క రూపాయి కూడా :
ఇదిలా ఉంటే లోకేష్ మంత్రిగా పలు శాఖలను చూస్తున్నారు ఆయన విద్యా ఐటీ ఆర్టీజీఎస్ శాఖల మంత్రిగా ఉన్నారు. దాంతో లోకేష్ మంత్రిగా అనేక పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఆయన ప్రజల కోసమే ప్రభుత్వంలో పనిచేస్తున్నపుడు ఖర్చు తీసుకోకూడదా అన్న ప్రశ్న కూడా వస్తుంది. అయితే లోకేష్ తన పర్యటనలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకోవడం లేదని అంటున్నారు. ఆయన ఖర్చుని సొంతానికి ఆయనే పెట్టుకుంటున్నారు అని కూడా ఆర్టీఐ చట్టం మేరకు అడిగిన ప్రశ్నకు జవాబు వచ్చింది. ఈ ప్రశ్నను సంధించిన ఆ వ్యక్తికి జవాబు ఇవ్వడమే కాదు అధికారికంగానూ ప్రభుత్వం దీని మీద వివరంగా తెలియచేసింది.
ఎక్కీ దిగే విమానాలకు :
ఇక లోకేష్ మంత్రిగా ప్రభుత్వంలో అతి ముఖ్య స్థానంలో ఉన్నారు. ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చేందుకు విదేశాలకు వెళ్తున్నారు. అలా ఆయన ఆస్ట్రేలియా సింగపూర్ వంటి దేశాలకు కూడా వెళ్ళారు. అయితే ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏణ్ణర్థం కాలంల్లో ఏకంగా 77 సార్లు విమానాలు ఎక్కీ దిగారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అలా ప్రజల సొమ్ముకే గండి కొడుతున్నారని ఆరోపిస్తోంది ఖజానాను ఫుల్ గా ఖాళీ చేస్తున్నారు అని కూడా విమర్శిస్తోంది. ఒక విధంగా ఇది రాజకీయ విమర్శగా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. మరి దీ నికి ఎక్కడో ఒక చోట ఎండ్ కార్డు పడాలి కదా. అందుకే ఆర్టీఐ కి అడిగిన పిటిషనర్ కి చెబుతూనే ప్రజలకు ప్రభుత్వం పూర్తిగా చెప్పాల్సింది చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది.
మొత్తం మ్యాటర్ క్లియర్ :
లోకేష్ మంత్రిగా మూడు శాఖలు చూస్తున్నారు అని అంతే కాదు ఆయన ఈ ఏణ్ణర్థం కాలంలో ఎక్కడెక్కడ ప్రయాణాలు చేశారో ఆయన ఎన్ని సార్లు విమానాలు ఎక్కారు, ఎంత చెల్లించారు అన్న దాని మీద ఏ ఖాతా నుంచి కూడా దానిని చెల్లించారు అన్న దాని మీద సమాచార శాఖ పూర్తి వివరాలు ఇచ్చి అంతా క్లియర్ చేసింది అని అంటున్నారు. లోకేష్ విదేశీ ప్రయాణాలకు కానీ తన సొంత ప్రయాణాలకు కానీ మంత్రిగా తనకు వస్తున్న జీతం నుంచే ఖర్చు పెట్టుకుంటున్నారు తప్పించి ప్రభుత్వం నుంచి వేరే విధంగా ఒక్క పైసా తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఒక్క పైసా ఆయన అదనంగా తీసుకుని వెచ్చించడం లేదని పేర్కొంది. ఇక లోకేష్ ఎన్ని సార్లు ప్రయాణం చేశారు అన్న దానికి అయితే ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం మంత్రులు ఎన్ని సార్లు అయినా ప్రయాణాలు చేస్తారు దానికి నియంత్రణ అన్నది లేదని చెప్పింది. సో మొత్తానికి అయితే లోకేష్ సర్కార్ పద్దులకు ఖర్చు రాయడం లేదు అని అధికార పూర్వకంగా తేల్చింది ప్రభుత్వం మరి దీని మీద వైసీపీ ఏమంటుందో చూడాల్సి ఉంది.