లోకేష్ కసి పట్టుదల చూశారా...జాగ్రత్త పడాల్సిందే !
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు తన మీద తప్పుడు వారలు రాసినందుకే తాను పరువు నష్టం దావా వేశాను అన్నారు.;
కూటమి ప్రభుత్వంలో ఐటీ విద్యా శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ పట్టుదల ఏమిటి అన్నది అంతా చూస్తున్నారు. ఆయన గతంలో అంటే 2017 నుంచి 2019 మధ్యలో మంత్రిగా ఉన్నపుడు నాడు విశాఖ విమానాశ్రయంలో ఆయన కోసం ఏకంగా లక్షలలో ఖర్చు పెట్టారు, ఇదంతా సర్కారీ సొమ్ము అని ఒక మీడియాలో వార్తలు వచ్చాయి. చినబాబు చిరు తిండి ఇరవై లక్షలండీ అంటూ కాప్షన్ పెట్టి మెరీ రాశారు. అయితే ఈ విషయంలో ఎంతో ప్రెస్టేజ్ గా తీసుకున్న నారా లోకేష్ పరువు నష్టం కేసు ఫైల్ చేశారు. గడచిన కొన్నేళ్లుగా ఆయన ఈ కేసు విషయంలో విశాఖ కోర్టుకు వస్తున్నారు. విపక్ష నేతగానూ మంత్రిగానూ ఇలా ఆయన ఎంత బిజీగా ఉన్నా వాయిదాలకు హాజరవుతున్నారు. అంతే కాదు తన మీద తప్పుడు వార్తలు రాస్తే అసలు ఊరుకోనని హెచ్చరిస్తున్నారు.
తాజా టూర్ లో :
ఇక ఈ కేసు విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం నారా లోకేష్ మరో సారి విశాఖ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు తన మీద తప్పుడు వారలు రాసినందుకే తాను పరువు నష్టం దావా వేశాను అన్నారు. తాను ఎపుడు విశాఖ వచ్చినా తన సొంత ఖర్చుతోనే అని చెప్పారు. అంతే కాదు తాను పార్టీ ఆఫీసులోనే బస చేస్తాను అని వివరించారు. ఏది రాసినా చూసుకుని రాయాలి కదా అని ఆయన అన్నారు. ఇక తప్పుడు వార్తలు రాస్తే అసలు ఊరుకునేది లేదని ఈ విధంగా లోకేష్ చాటి చెప్పారు.
తప్పుడు వార్తలు రాస్తే :
ఎవరైనా తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. అంతే కాదు చట్టపరంగా ఈ చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో సైతం తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారి మీద అలాగే వేధింపులకు పాల్పడే వారి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని లోకేష్ చెప్పారు.
పట్టువదలకుండా :
ఈ దేశంలో లేదా రాష్ట్రాలలో ఎన్నో సార్లు ఎందరి మీదో తప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఎవరూ ఇంత సీరియస్ గా తీసుకోలేదు. లోకేష్ మాత్రం ఈ విషయం మీద ఎంతటి పట్టుదలగా ఉన్నారో విశాఖలో ఆయన దాఖలు చేసిన పరువు నష్టం కేసు ఒక ఉదాహరణ. ఒక విధంగా ఇది అతి ఉత్సాహంతో వార్తలు వండే వారికి హెచ్చరికగా చూడాలి. అదే సమయంలో తాను ఏ మాత్రం ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు అని అంటున్నారు. సో లోకేష్ విషయంలో ఏది మాట్లాడినా లేక వార్తలు రాసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనడానికి ఈ కేసు ఒక అచ్చమైన ఉదాహరణగా చెబుతున్నారు.