వణుకు పుట్టించే మరో రోడ్డు ప్రమాదం.. అర్థరాత్రి నంద్యాలలో బస్సు -లారీ ఢీ

అర్థరాత్రి ఒంటిగంట సమయంలో రోడ్డుకు ఎడమవైపు లారీ ఒకటి ఆగి ఉంది. బస్సులో ఉన్నే ప్రయాణికుడు ఒకరు అర్జెట్ గా వాష్ రూమ్ కు వెళ్లాలని అడగటంతో సరిగ్గా లారీ వెనుక బస్సు ఆగింది.;

Update: 2025-11-23 06:21 GMT

ట్రావెల్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికుల్నివణికిస్తున్నాయి. కర్నూలు విషాదాన్ని ఇప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేదు. ట్రావెల్ బస్సుల్లో ప్రయాణించే వారిలో కొందరు బస్సుప్రయాణానికి భయపడుతున్నారు. ఇలాంటి వేళ.. నంద్యాలలో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం వణికించేలా మారింది.

నంద్యాల జిల్లాలో ట్రావెల్ బస్సు.. లారీ ఢీ కొన్న సందర్భంలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. సీటు మార్చుకున్న ఒకరు ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయపడగా.. మరొకరు మాత్రంమృతి చెందటం షాకింగ్ గా మారింది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళుతున్న మైత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయి పల్లి మిట్ట వద్ద ప్రమాదానికి గురైంది.

అర్థరాత్రి ఒంటిగంట సమయంలో రోడ్డుకు ఎడమవైపు లారీ ఒకటి ఆగి ఉంది. బస్సులో ఉన్నే ప్రయాణికుడు ఒకరు అర్జెట్ గా వాష్ రూమ్ కు వెళ్లాలని అడగటంతో సరిగ్గా లారీ వెనుక బస్సు ఆగింది. ప్రయాణికుడు దిగిన వెంటనే.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఒకటి బస్సును ఢీకొంది. ముందు ఉన్న ట్రావెల్ బస్సును వెనుక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ గమనించకపోవటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

బస్సు వెనుకవైపు ఉన్న ఇద్దరు ప్రయాణికులు ఈ ప్రమాదంలో మరణించారు. మరో షాకింగ్ అంశం ఏమంటూ.. మరణించిన ఇద్దరిలో హరిణి సీటు ముందు వైపు ఉంది. అయితే.. వెనుక సీటులో ప్రయాణించాల్సిన నరసింహారెడ్డి తన సీటును ముందుకు.. హరణి ముదు సీటును వెనక్కి మార్చుకోవటంతో ఆయన ప్రాణాలతో బయటపడగా.. సీటు మార్చుకున్న హరిణి ప్రాణాల్ని కోల్పోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన పలువురిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News