• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీడీపీలో హాట్ టాపిక్‌:...

టీడీపీలో హాట్ టాపిక్‌: బాల‌య్య‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే..!

| టిడిపి సీనియర్ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా మూడుసార్లు విజయం దక్కించుకున్నారు.

By - Garuda Media
Update: 2025-10-16 04:32 GMT

టిడిపి సీనియర్ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా మూడుసార్లు విజయం దక్కించుకున్నారు. 2019లో భారీ ఎత్తున వైసిపి ప్రభావం కనిపించినప్పటికీ ఆయన హిందూపురంలో విజయం దక్కించుకుని పార్టీని నిలబెట్టారు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన కీలక విషయం ఆసక్తిగా మారింది. తాజాగా బాలయ్య తన సొంత నియోజకవర్గంలో గత నాలుగు రోజుల నుంచి పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన అభిమానులతో పాటు పార్టీ నాయకులు నుంచి కూడా బాలయ్య కు మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ తెర‌మీద‌కు వచ్చింది. 40 సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారని ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని చాలామంది నాయకులు ఆయన అభిమానులు కార్యకర్తలు కూడా ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో బాలయ్యకు మంత్రి పదవి ఇస్తే ఏం జరుగుతుంది? అనే విషయం టిడిపిలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

వాస్తవానికి బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. చంద్రబాబు తలుచుకుంటే ఇవ్వచ్చు. కానీ ఒకే కుటుంబం నుంచి ఇంతమందికి పదవులు ఇవ్వడం సరికాదన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. పైగా సినీ రంగంలో ఇప్పుడు బాలయ్య ప్రస్థానం జోరుగా సాగుతోంది. చేతిలో నాలుగైదు సినిమాలు కూడా ఉన్నాయని సమాచారం. మంత్రి పదవి అంటే లేనిపోని విమర్శలు తెచ్చుకోవడం తప్ప మరొకటి కాదన్నది చంద్రబాబు ఆలోచన. పైగా బాలకృష్ణకు కూడా మంత్రి పదవిపై పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు.

ఎందుకంటే ఆయన అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా సీఎం చంద్రబాబు స్వయంగా వియ్యంకుడు. ఆయన అల్లుడే మంత్రిగా ఉన్నారు. పదవులతో ఆయనకు వచ్చేది కూడా ఏమీ ఉండదు. బాలయ్యకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా అభిమానులు పార్టీ కార్యకర్తలు మాత్రం బలంగా ఆయనను మంత్రిగా చూడాలని కోరుకుంటున్న మాట వాస్తవం. ఈ విషయంలో టిడిపిలో ఆసక్తికర చర్చ‌ అయితే నడుస్తోంది. ఆయన, ఇప్పటికే దూకుడుగా ఉంటారని మంత్రి పదవి ఇస్తే మరింత దూకుడు పెంచుతారని ఒక నాయకుడు అంతర్గతంగా వ్యాఖ్యానించారు.

అయితే బాలయ్య వ్యక్తిగత స్వభావమే అటువంటిది కాబట్టి ఆయనను పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నది మిగిలిన వారి మాట. ఏదేమైనా ఇది కేవలం చర్చకు మాత్రమే పరిమితం. భవిష్యత్తులో అయినా ఇప్పుడైనా బాలయ్యకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచన ఉన్నప్పటికీ అది సాకారం కావడం కష్టం అన్నది సీనియర్ నాయకులు చెబుతున్న మాట.

Tags:    
  • NandamuriBalakrishna 
  • TDP 
  • AndhraPolitics 
  • MinisterialDebate 
  • Hindupur 
  • ChandrababuNaidu 
  • PartyDiscussions 
  • FansDemand 

Similar News

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

Copyright @2026

Powered by Blink CMS