పుడ్ డెలివరీ కోసం 22వ అంతస్తుకు వెళ్లాడు.. కట్ చేస్తే?
పుడ్ డెలివరీ కోసం ఒక బహుళ అంతస్తుల భవనంలోని 22వ అంతస్తుకు వెళ్లిన అతడు.. స్విమ్మింగ్ ఫూల్ లో పడి చనిపోయిన దారుణ ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..;
పుడ్ డెలివరీ కోసం వెళ్లిన గిగ్ వర్కర్ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఉదంతం గురించి తెలిసినంతనే విస్మయానికి గురయ్యేలా ఉన్న ఈ ఉదంతం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటు చేసుకుంది. పుడ్ డెలివరీ కోసం ఒక బహుళ అంతస్తుల భవనంలోని 22వ అంతస్తుకు వెళ్లిన అతడు.. స్విమ్మింగ్ ఫూల్ లో పడి చనిపోయిన దారుణ ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
ముంబయికి చెందిన 44 ఏళ్ల ఇమ్రాన్ అక్బర్ ఖోజ్దా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లో డెలివరీ ఏజెంట్ గా పని చేస్తున్నాబు. తాజాగా గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక బహుళ అంతస్తు భవనంలోకి ఫుడ్ డెలివరీ కోసం వెళ్లాడు. ఫుడ్ డెలివరీ కోసం వెళ్లిన అతను ఫోన్ మాట్లాడుకుంటూ 22వ అంతస్తుకు వెళ్లాడు.
అయితే.. ఫూల్ అంచున నడుస్తున్న అతను అకస్మాత్తుగా అందులోకి పడిపోయాడు. ఈత రాకపోవటం.. ఈ ఘటనను చూసినోళ్లు ఎవరూ లేకపోవటంతో.. అతడ్ని రక్షించే అవకాశం లేకుండా పోయింది. దీంతో.. అతను చనిపోయాడు. అతడి మరణంపై తమకు ఎవరి మీదా ఎలాంటి అనుమానం లేదని.. బాధితుడి కుటుంబీకులు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ కేసును అనుమానాస్పద మరణంగా నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ ఉదంతం గిగ్ వర్కుర్లకు ఒక హెచ్చరికగా చెబుతున్నారు. డెలివరీ సమయంలో అప్రమత్తంగా ఉండాలని.. నిర్లక్ష్యం.. ఏమరపాటు ప్రాణాలు తీసే పరిస్థితి ఉంది. గతంలో హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ కోసం వెళ్లిన డెలివరీ బాయ్ పెంపుడు కుక్కకు భయపడి దూకేయటం.. ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. ఈ తరహా విషాద ఉదంతాలు గిగ్ వర్కర్లకు ఎదురవుతుంటాయి. అందుకే.. డెలివరీ వేళలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.