బలవంతంగా హిజాబ్ తొలగించి మగ్ షాట్... ఫైన్ ఎన్ని కోట్లో తెలుసా?

ఈ సమయంలో... ఆ వ్యాజ్యాన్ని పరిష్కరించేందుకు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ $17.5 మిలియన్లు చెల్లించడానికి అంగీకరించింది

Update: 2024-04-06 23:30 GMT

అమెరికాలోని న్యూయార్ నగరంలో ఇద్దరు ముస్లిం మహిళలకు అవమానం జరిగిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా వారి తలలపై ఉన్న ముసుగులను తొలగించి ఫోటోలు తీశారు. ఇలా హిజాబ్ ను తొలగించడంతో పాటు.. ఇలా బలవంతంగా ఫోటోలు తీయడంపై ఆ ఇద్దరు మహిళలూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో... ఆ వ్యాజ్యాన్ని పరిష్కరించేందుకు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ $17.5 మిలియన్లు చెల్లించడానికి అంగీకరించింది.

అవును... 2017లో స్థానిక చట్టాలను, నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలతో ఇద్దరు ముస్లిం మహిళలను అరెస్ట్ చేశారు న్యూయార్క్ పోలీసులు! ఆ తర్వాత వారిని జైలుకు పంపేముందు నిబంధనలలో భాగంగా వారికి ఫోటోలు తీశారు. వీటిని మగ్ షాట్ అంటారు. ఈ సమయంలో ఈ ఫోటోల కోసం ఆ మహిళల హిజాబ్ ను తొలగించారు. దీంతో.. ఈ ఘటనను బాధిత మహిళలు అవమానంగా భావించారు.

అనంతరం తమకు అవమానం జరిగిందంటూ 2018లో కోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో బాధితుల తరుపు న్యాయవాది మాట్లాడుతూ... వారి వారి మతవిశ్వాసాలను పరిగణలోకి తీసుకోకుండా.. పోలీసులు అలా దురుసుగా ప్రవర్తించడం, హిజాబ్ ని తొలగించడం తీవ్ర అవమానం అని, వారి మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన బాధిత మహిళల్లో ఒకరు... "వారు నా హిజాబ్ తీయమని బలవంతం చేసినప్పుడు, నేను నగ్నంగా ఉన్నట్లు అనిపించింది" అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో... మగ్ షాట్ నిబంధనలపై అమెరికా అంతటా చర్చ జరిగింది. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో 202లో మగ్ షాట్ నిబంధనల్లో పోలీసులు పలుమార్పులు చేశారు.

Read more!

ఇందులో భాగంగా... మగ్ షాట్ సమయంలో ముస్లిం మహిళలు హిజాబ్ తొలగించనవసరం లేదని.. ముఖం కనిపించేలా ఉంటే చాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో... ఈ నియమం ఇతర మతాల వారికీ వరిస్తుందని తెలిపారు. సిక్కులు కూడా మగ్ షాట్ సమయంలో తమ తమ టర్బన్ లను తొలగించాల్సిన అవసరం లేదని వివరించారు.

ఈ సమయంలో సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం బాధీత మహిళలతోఈ పాటు గతంలో ఈ విధంగా ఇబ్బందిపడిన వారికీ పరిహారం చెల్లించేందుకు పోలీసులు అంగీకరించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈ ఇద్దరు బాధిత మహిళలు ఇద్దరికీ కలిపి 17.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది. ఇది మన కరెన్సీలో సుమారు 146 కోట్ల రూపాయలకు సమానం!

Tags:    

Similar News