ఎంపీ మెడలో చైన్ స్నాచింగ్.. అవాక్కయిన పోలీసులు..!

ఒక పెద్ద స్థాయి నాయకురాలి మెడలో చైన్ ను దొంగతనం చేస్తే సాధారణ వ్యక్తుల విషయం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.;

Update: 2025-08-04 08:30 GMT

కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ల కావేవి కవితకు అనర్హం అని శ్రీశ్రీ చెప్పారు. అది ఒక కవిత విషయంలోనే కాదు.. చాలా సందర్భాల్లో ఈ పదాలను వినియోగిస్తూనే ఉంటారు. ఇటీవల ఒక చైన్ స్నాచర్ ఇలాంటిదే చేసి అవాక్కయ్యేలా చేశాడు. సాధారణ మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేసే వ్యక్తం ఏకంగా ఒక వీవీఐపీ మెడలో గొలుసు స్నాచింగ్ చేశాడు. దీంతో మొత్తం నియోజకవర్గం పోలీసులు అలర్ట్ అయ్యారు. ఒక పెద్ద స్థాయి నాయకురాలి మెడలో చైన్ ను దొంగతనం చేస్తే సాధారణ వ్యక్తుల విషయం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఎవరికి వారు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దొంగ గట్స్ ను చూసి నివ్వెరపోతుంటే.. మరికొందరు పోలీసుల పట్టింపులేని తనంపై పెదవి విరుస్తున్నారు.

ఎంపీని చూసి అలర్టయిన పోలీసులు..

ఆమె దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ మెంబర్. ఉదయాన్నే పోలీస్ స్టేషన్ వచ్చిన ఆమెను చూసిన పోలీసులు ఇన్ స్పెక్షన్ కు వచ్చిందనుకున్నారు.. పోలీస్ సిబ్బంది అంతా అలర్టయ్యారు. ప్రజా ప్రతినిధి కాబట్టి కూర్చోబెట్టి మర్యాదలు చేశారు. తాను ఇన్ స్పెక్షన్ కు రాలేదని ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో దొంగ నా మెడలో గొలుసు లాక్కొని వెళ్లిపోయాడని చెప్పడంతో పోలీసులకు చెమటలు పట్టినంతపనైంది. సాధారణ వ్యక్తి అయితే.. పట్టిస్తాం.. కేసు రాసుకుంటాం.. దర్యాప్తు చేస్తున్నాం.. త్వరలోనే పట్టుకుంటాం.. అంటారు. కానీ ఫిర్యాదు చేసింది ఒక నియోజకవర్గం ఎంపీ వేగంగా స్పందించి గాలింపు చేపట్టారు.

వాకింగ్ చేస్తుంటే.. ఎదురుగా బైక్ పై..

తమిళనాడుకు చెందిన మయిలాదుతురై స్థానానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సుధా రామకృష్ణన్ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో దేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు. ప్రతీ రోజు వాకింగ్ చేయడం ఆమెకు అలవాటు. రోజు మాదిరిగానే సోమవారం (ఆగస్ట్ 4) ఉదయం డీఎంకే నాయకురాలైన రజతితో కలిసి చాణక్యపురిలో పోలాండ్ ఎంబసీ సమాపంలో వాక్ చేస్తున్నారు. అయితే వెనుక నుంచి బైక్ పై వచ్చిన దండగుడు ఆమె మెడలో గొలుసు కొట్టేశాడు. ఈ చోరీ అత్యంత ఆందోళనను కలిగించిందని హోం మంత్రి అమిత్ షాక్ లేఖ రాసింది. సదరు దుండగుడు బలంగా గొలుసును లాగడంతో మెడపై గాయాలయ్యాయి. దీంతో పాటు బట్టు కూడా చినిగిపోయాయని చెప్పుకచ్చింది.

తేరుకునేందుకు పట్టిన సమయం..

హఠాత్తుగా జరిగిన పరిణామంతో తేరుకునేందుకు సమయం పట్టిందని ఆ తర్వాత సాయం కోసం చూస్తుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం కనిపించిందని వారికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దేశ రాజధానిలోనే పరిస్థితి ఇలా ఉంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించడం కొసమెరుపు. ఈ ఘటన తనను బాధించిందని ఎంపీ చెప్పింది.

Tags:    

Similar News