షాకింగ్ ఘటన... మాజీ ప్రియురాలి గొంతు కోసి పారిపోయాడు!

వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌ లోని నర్సింగ్‌ పూర్ జిల్లా ఆస్పత్రిలో 19 ఏళ్ల విద్యార్థిని నర్సింగ్ ట్రైనింగ్ పొందుతోంది.;

Update: 2025-07-02 15:14 GMT

ఇటీవల జరుగుతున్న నేరాలు, ఘోరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే! చంపడం అన్ని సమస్యలకూ ప్రాథమిక పరిష్కారం అన్నట్లుగా భావిస్తున్న పలువురు... కత్తులకు పని చెబుతున్నారు. ఇన్ని రోజులుగా జీవిత భాగస్వాములను మట్టుబెట్టిన వారి సంఘటనలు హల్ చల్ చేయగా.. తాజాగా తన మాజీ ప్రియురాలి గొంతు పబ్లిక్ లో కోసిన వ్యక్తి ఉదయం తెరపైకి వచ్చింది!

అవును... దేశంలో ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా, తెచ్చినా.. వాటి సాయంతో కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నా.. దారుణాలకు పాల్పడేవారు మాత్రం ఆగడం లేదు, తగ్గడం లేదు. ఈ క్రమంలో ప్రజలంతా చూస్తుండగానే ఓ యువతిని పట్టపగలు గొంతు కోసి చాకచక్యంగా అక్కడి నుంచి పారిపోయాడో దుర్మారుడు! దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్‌ లోని నర్సింగ్‌ పూర్ జిల్లా ఆస్పత్రిలో 19 ఏళ్ల విద్యార్థిని నర్సింగ్ ట్రైనింగ్ పొందుతోంది. ఈ క్రమంలో... ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఉన్న ఆమెపై అభిషేక్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి గొంతు కోశాడు. అనంతరం తాను ఆత్యహత్య చేసుకున్నట్లు నటించాడు!

అయితే... ఆ సమయంలో చుట్టూ జనం ఉన్నా ఆపే ప్రయత్నం చేయలేదు సరికదా ఆ దారుణాన్ని తమ తమ మొబైల్స్ తో వీడియోలు తీసే పనిలో మునిగిపోయారు! అలా తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నటించిన అభిషేక్... అనంతరం ఆస్పత్రి బయటకు వెళ్లి బైకుపై పరారయ్యాడు.

ఈ ఘటనతో ఆస్పత్రిలో రోగులు, బంధువులు ఒక్కసారిగా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సమయంలో... భారీగా రక్తస్రావం కావడంతో ఆమె అక్కడే చనిపోయింది. ఈ ఘటన ఉదయం చనిపోతే.. మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని తెలుస్తోంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

కాగా... వీరిద్ధరి మధ్య చాలా కాలం నుంచి బంధం ఉందని అంటున్నారు. అయితే కొంతకాలంగా ఆమె, సదరు యువకుడికి దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో యువకుడు.. ఆమెపై పగ పెంచుకున్నాడు. దారుణానికి ఒడిగట్టాడు. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

Full View
Tags:    

Similar News