స్త్రీగా పుట్టినందుకు గర్వపడుతున్నాను....టీడీపీ ఎంపీ భావోద్వేగం

తాను వైద్య విద్యను అభ్యసించాను అని ఆమె అన్నారు అలా ఒక డాక్టర్ గా ప్రజా సేవ చేద్దామని అనుకున్నాను, అయితే అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చా, ఇంకా బెటర్ గా ప్రజా సేవ చేస్తున్నాను అన్న సంతోషంగా ఉంది ఎంపీ శబరి చెప్పారు.;

Update: 2025-11-25 21:30 GMT

భారతదేశంలో ఒక స్త్రీగా పుట్టినందుకు గర్వపడుతున్నాను అని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చెప్పారు. ఈ దేశంలో పుట్టడం ఎంతో ఆనందకరం అని అన్నారు. నందికొట్కూరు పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ మహిళ అంటే శాంతానికి ప్రేమకు అభిమానానికి ప్రతీక అని ఆమె అభివర్ణించారు. పురుషులతో సమానంగా ఈ రోజు మహిళలు రాణిస్తున్నారు అని గుర్తు చేశారు. ఎన్నో అవకాశాలు మహిళలకు ఈ దేశం ఇస్తోంది అని అన్నారు. మహిళా అభ్యుదయానికి ప్రగతికి ప్రభుత్వాలు ఎన్నో విధంగా సాయపడుతున్నాయని ఎంపీ శబరి అన్నారు.

అనూహ్యంగా రాజకీయాల్లోకి :

తాను వైద్య విద్యను అభ్యసించాను అని ఆమె అన్నారు అలా ఒక డాక్టర్ గా ప్రజా సేవ చేద్దామని అనుకున్నాను, అయితే అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చా, ఇంకా బెటర్ గా ప్రజా సేవ చేస్తున్నాను అన్న సంతోషంగా ఉంది ఎంపీ శబరి చెప్పారు. తనలాగానే ఎంత మంది మహిళకు రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు అని ఆమె అన్నారు. రాజకీయాల్లో ప్రజా సేవకు మంచి మార్గం అని ఆమె అన్నారు.

వరల్డ్ కప్ కొట్టాం :

మహిళలు ఏ రంగంలో అయినా ఎవరికీ తక్కువ కారని ఎన్నో సార్లు రుజువు అయింది అని అన్నారు. తాజాగా చూస్తే వరల్డ్ కప్ కొట్టింది మహిళా టీం అని ఆమె గుర్తు చేశారు. వారిని ఆ విధంగా తీర్చిదిద్ది ప్రోత్సహించిన వరి తల్లిదండ్రులకు ధన్యవాదాలు అని ఎంపీ శబరి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ మహిళలు యుద్ధం చేశారు. శతౄవు పీచమణచారు అని ఆమె చెప్పారు. అలా అన్ని రంగాలలో మహిళలు సాధిస్తున్నారు అని ఆమె అన్నారు. ఈ రోజున ప్రతీ అమ్మాయి తన తన భవిష్యత్తు గురించి సీరియస్ గా ఆలోచించుకోవాలని ఆమె అన్నారు. అలా ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు అడుగులు వేసిన నాడు సాధించలేనిది ఏదీ ఉండదని ఆమె అన్నారు.

అంతా సమానమే :

తల్లిదండ్రులు ఆడపిల్లలను మగ పిల్లలతో సమానంగా విద్యార్థులను నేర్పించడమే కాకుండా వారికి యుద్ధ విద్యలలో కూడా శిక్షణ ఇప్పించాలని ఎంపీ శబరి పిలుపునిచ్చారు. సమస్యలు వచ్చినప్పుడు సింహంలా ముందుకు వెళ్లి సమస్యలపై పోరాటం చేసి నిలబడాలని మహిళలకు ఆమె సూచించారు. వారు ఎందులోనూ ఎవరితోనూ తక్కువ కాదని గుర్తించాలని కోరారు. ఎవరికైనా ఈ ప్రపంచంలో మొదటి గురువు తల్లి అని అలాంటి తల్లిని ఆదరించి ఆ తల్లి చెప్పిన మార్గంలో నడిచిన ఏ ఒక్కరు కూడా జీవితంలో విఫలం కారని ఎంపీ అన్నారు. బ్రిటిష్ వారితో వీరోచితంగా పోరాడి బ్రిటిష్ వారి గుండెల్లో గుబులు పుట్టించిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి అని గుర్తు చేశారు. ఆమెను ప్రతీ మహిళ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. తాను ఒక అబల అని కాకుండా యుద్ధరంగంలో సింహంలా గర్జించి శత్రువులను పరుగులెత్తించిన సాహసి ఝాన్సీ లక్ష్మీబాయిని మహిళాలోకం అనుక్షణం గుర్తుంచుకోవాలని అన్నారు.

Tags:    

Similar News