సర్వే షాక్: ఉద్యోగులంతా మిస్ కాకుండా చదవాలి

వారంలోని ఇతర రోజులతో పోలిస్తే సోమవారం గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పదిహేను శాతం ఎక్కువగా ఉందన్న విషయాన్ని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు.;

Update: 2025-09-30 07:52 GMT

ఇప్పటివరకు ఫోకస్ చేయని ఒక కొత్త అంశం మీద ఒక ఆసక్తికర సర్వే రిపోర్టు విడుదలైంది. ఉద్యోగులంతా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఈ నివేదికలోని అంశాలు సరికొత్త చర్చకు తెర తీశాయని చెప్పాలి. వీకెండ్ వేళ.. ఎంజాయ్ చేస్తూ చిల్ అయ్యే ఉద్యోగులు.. వీక్ మొదలయ్యే సోమవారం ఎక్కువగా హార్ట్ ఎటాక్ లకు గురవుతున్న విషయాన్ని తాజా సర్వే గుర్తించింది. జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ ఆసుపత్రి చేసిన ఈ సర్వే ఉద్యోగులకు సోమవారం షాకిస్తున్న విషయాన్ని వెల్లడించింది.

ఇంతకూ సోమవారం ఎక్కువగా గుండెపోట్లకు కారణమేంటి?అన్న విషయాన్ని వివరంగా వెల్లడించింది. వీకెండ్ ను సంతోషంగా గడిపి.. సోమవారం ఆఫీసుకు వచ్చేసరికి అప్పటికే ఉన్న పెండింగ్ పనులు.. బాస్ లతో మీటింగ్ లు.. డెడ్ లైన్లు లాంటివన్నీ ఒక్కసారి మీడ పడటంతో ఆ ప్రభావం ఆరోగ్యంపైన ఉంటుందని తాజా సర్వేలో వెల్లడైంది. సెప్టెంబరు 29న వరల్డ్ హార్ట్ డే ను పురస్కరించుకొని తాము చేసిన సర్వే వివరాల్ని వెల్లడించింది.

వారంలోని ఇతర రోజులతో పోలిస్తే సోమవారం గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పదిహేను శాతం ఎక్కువగా ఉందన్న విషయాన్ని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయని పేర్కొంటూ.. వీకెండ్ లో వారంలో మిగిలిన రోజుల మాదిరి నిద్ర పోకుండా ఉండటం.. ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం.. డ్రింక్ చేయటంతో పాటు పార్టీలతో శరీరంపై ఒత్తిడి ఎక్కువ అవుతుందని పేర్కొంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సోమవారం పని ఒత్తిడి.. మీటింగ్ టెన్షన్ లతో పాటు.. టార్గెట్ల టెన్షన్ తో హర్మోన్లపై ఒత్తిడి పెరిగి గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఈ సమస్యల వల్ల యూత్ లో గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతున్న విషయాన్ని సర్వే వెల్లడించింది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే.. జీవనశైలిలో మార్పులతో పాటు.. ఆరోగ్యకరమైన దినచర్యల్ని పాటించాల్సి ఉంటుందని చెబుతున్నారు. సో.. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు ఈ అంశంపై అవగాహన పెంచుకోవటం చాలామంచిదని చెప్పక తప్పదు.

Tags:    

Similar News