అర్మన్ నక్సల్స్‌ను కూడా ఏరేస్తాం: మోడీ సంచలన వ్యాఖ్యలు
అడవుల్లో దాక్కొని ప్రభుత్వాలను ఇరుకున పెట్టి పెను సమస్యగా మారిన అసలు నక్సల్స్‌ను అంతమొందించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
అడవుల్లో దాక్కొని ప్రభుత్వాలను ఇరుకున పెట్టి పెను సమస్యగా మారిన అసలు నక్సల్స్‌ను అంతమొందించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అయితే.. వారిని ఏరివేయడం తమకు ఇబ్బందిగా లేకపోయినా.. ప్రజల మధ్య ఉంటూ.. ప్రజాస్వామ్యా నికి,ప్రజలకు కూడా ఇబ్బందిగా మారిన దిమాగీ నకల్స్(అర్బన్ నక్సల్స్) పెద్ద సమస్యగా మారారని వ్యాఖ్యానించారు. వీరిని కూడా ఏకాకులను చేయడంతోపాటు ఏరేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాలకు వీరు కంట్లో నలుసుగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరివల్ల ప్రయోజనం కంటే.. విపరిణామాలే ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
నిజానికి 2014-17 మధ్య కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అర్బన్ నక్సల్స్ పేరుతో పెద్ద ఉద్యమమే నడిపించింది. ప్రభుత్వా న్ని విమర్శించే వారు.. ప్రధానిని ప్రశ్నించేవారు.. సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో అర్ధం చేసుకోవాలంటూ.. అప్పట్లో హోం మంత్రి అమిత్‌షా బహిరంగ విమర్శలే చేశారు. ఈ క్రమంలోనే ప్రధానిని హత్య చేయబోయిన నక్సల్స్‌కు మేధో సాయం చేశారంటూ.. తెలంగాణకు వరవరరావు, కళ్యాణ్‌రావు వంటివారిని జైలుకు కూడా పంపించారు. ప్రస్తుతం వరవరరావు జైల్లోనే ఉన్నారు. ఇక, మహారాష్ట్రకు చెందిన పలువురు సామాజిక ఉద్యమ కారులను కూడా జైల్లో పెట్టారు.
ఇప్పటి లక్ష్యం వేరు..
ఇక, ఇప్పటి లక్ష్యం వేరుగా కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు యువత ముం దుకురావడం.. ఉద్యమాలు చేపట్టడం వంటివి కేంద్రానికి కంట్లో నలుసుగా మారాయన్నది వాస్తవం. ఇటీవల నీట్ పరీక్షపై చే పట్టిన ఉద్యమం అనంతరం.. ప్రభుత్వం తీవ్రంగా ఇరుకున పడింది. పార్లమెంటును కూడా ఈ ఉద్యమం కుదిపివేసింది. భవిష్య త్తులో ఉద్యమాలు మరింత విస్తరిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ వంటి ఉద్యమ సంస్థలు ప్రకటించాయి. ఇవి కూడా కేంద్రానికి ఇబ్బందిగానే మారనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అర్బన్ నక్సల్స్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ముందుంది ముచ్చట!
మరోవైపు.. త్వరలోనే యూపీ,పంజాబ్ సహా.. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. యువత ఉద్యమ బాట పట్టింది. ఈ ఎఫెక్ట్ ఆ ఎన్నికలపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. అందుకే.. అర్బన్ నక్సల్స్‌ను కూడా అణిచేస్తామని ప్రధాని ప్రకటించడం గమనార్హం. అయితే.. ఇది నిజంగానే చేస్తారా? లేక ప్రకటనలకే సరిపుచ్చుతారా అనేది చూడాలి. ఇప్పటికైతే.. యువత తెగించే ఉన్నారన్నది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్యమాలు స్పష్టం చేశాయి. సో.. మొత్తంగా ప్రధాని వ్యాఖ్యల అంతరార్థం.. తమను ప్రశ్నించవద్దనే!. మరి ఏం జరుగుతుందో చూడాలి.