ట్రంప్ పుణ్యం..భారత్ చైనా బంధం !

భారత్ విషయంలో ఇపుడు అదే జరుగుతోంది భారత్ చైనా పక్క పక్క దేశాలు. అతి పెద్ద దేశాలు. దక్షిణాసియాలో కీలకమైన దేశాలు.;

Update: 2025-08-30 12:30 GMT

కొన్ని సార్లు చూస్తే ప్రతికూల పరిస్థితులే అనుకూలం అవుతాయి. సావళ్ళ నుంచే కొత్త జవాబులు వస్తాయి. భారత్ విషయంలో ఇపుడు అదే జరుగుతోంది భారత్ చైనా పక్క పక్క దేశాలు. అతి పెద్ద దేశాలు. దక్షిణాసియాలో కీలకమైన దేశాలు. ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికి ఏడు దశాబ్దాల క్రితం మంచి స్నేహ బంధమే ఉండేది. ఆనాడు ప్రపంచ పెద్దన్నగా అమెరికా లేదు. అయితే తరువాత కాలంలో చైనా భారత్ కత్తులు దూసుకున్నాయి.

రష్యాతో శాశ్వత చెలిమి :

ఇక భారత్ విషయం చూస్తే కాలాలకు అతీతంగా రష్యాతో మంచి స్నేహ బంధమే ఉంది. అది ఎప్పటికీ కొనసాగుతోంది. నమ్మదగిన మిత్రుడిగా రష్యా భారత్ కి ఉంటూ వస్తున్నారు. చిత్రమేంటి అంటే రష్యాకు చైనా మిత్రుడు. అయినా సరే భారత్ చైనాల మధ్య స్నెహాన్ని రష్యా అయితే చేయించలేకపోయింది. తన మిత్ర దేశాల రెండు చేతులని కలపలేకపోయింది.

ట్రంప్ దూకుడుతోనే :

అయితే అమెరికాకు రెండవసారి అధ్యక్షుడు అయిన ట్రంప్ మాత్రం ఈ పుణ్యం కట్టేసుకున్నారు. రష్యా ముంచి చమురు కొంటోంది అన్న కారణంతో భారత్ మీద అకారణమైన ద్వేషాన్ని పెంచుకుని పాతికికు మరో పాతిక అంటూ యాభై సాతం అధిక సుంకాలు పెంచేసి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. అయితే ఈ టారిఫ్ లే చివరికి ట్రంప్ కొంప ముంచేలా కనిపిస్తున్నాయని అంటున్నారు. భారత్ చైనా రెండు దేశాలు కలిస్తే మాత్రం అమెరికాకే ఇబ్బంది అని అంతర్జాతీయ దౌత్య నిపుణులు చెప్పే మాటాగ ఉంది.

కొత్త శకానికి నాందిగా :

భారత్ చైనా దేశాల మధ్య సంబంధాలు కొత్త శకానికి నాందిగా మారుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అయిదేళ్ళ క్రితం పూడ్చలేని అగాధంగా ఈ రెండు దేశాల మధ్య బంధాలు ఉండేవి. దానికి కారణం 2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలుగా చెప్పాలి. ఈ ఘర్షణాలలో ఏకంగా ఇరవై మందికి పైగా తన సైనికులను భారత్ కోల్పోయింది. దాంతో ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ చైనాల మధ్య ఇక అగాధమే అని అంతా అనుకున్నారు. కానీ తిరిగి ఈ తీరున వికసిస్తాయని ఎవరూ ఊహించలేదు. దానికి బీజం గత ఏడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు అని చెప్పాలి. ఆనాడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అలా సానుకూలంగా మారిన ఈ వాతావరణం ఇపుడు మరింతగా పెరిగింది.

ఏడేళ్ళ తరువాత చైనాకు మోడీ :

ఈ నేపధ్యంలో ఏడేళ్ళ తరువాత నరేంద్ర మోడీ చైనాకు వెళ్తున్నారు ఆయన చివరి సారిగా 2018లో చైనాకు వెళ్ళారు. ఈసారి ఆయన పర్యటన చాలా ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా అంతర్జతీయంగా అమెరికా ఆంక్షల నేపధ్యంలో ప్రపంచం అంతా దీనిని గమనిస్తోంది. ఇక చూస్తే కనుక ఈ నెల 31న షాంఘై సహకార సంస్థ యొక్క 25వ దేశాధినేతల మండలి సమావేశం చైనాలోని టియాంజిన్‌లో ప్రారంభమవుతుంది. దీనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని రెండు రోజుల చర్చలలో ప్రపంచ నాయకులతో కలసి కీలక చర్చలు జరపనున్నారు ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ పాలనలో కొత్త నిబంధనలను రూపొందించడానికి అదే విధంగా ప్రాంతీయ భద్రత, కనెక్టివిటీ, స్థిరమైన అభివృద్ధి సభ్య దేశాల మధ్య గొప్ప సంఘీభావం వంటి అంశాలను పరిష్కరించడానికి దోహదపడుతుందని అంతా భావిస్తున్నారు.

చైనా ఆతీధ్యం కీలకం :

షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి చైనా ఆతిథ్యం ఇవ్వడం ఇది ఐదవసారి, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ కార్యకలాపాలకు అధ్యక్షత వహిస్తారు, 20 మందికి పైగా ప్రపంచ నాయకులు అలాగే మరో మంది అంతర్జాతీయ సంస్థల అధిపతులు ఈ సదస్సుకు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సదస్సులో ప్రముఖంగా పాల్గొంటున్నారు, ఇది ఇప్పటివరకు జరిగిన వాటిలో అతిపెద్ద అత్యంత ప్రతిష్టాత్మకమైన సమావేశంగా నమోదు అవుతోంది.

మూడూ కలిస్తే మూడినట్లే :

ఇక రష్యా చైనా భారత్ కలిస్తే అమెరికాకు మూడినట్లే అంటున్నారు. రానున్న రోజులలో అమెరికా అంతర్జాతీయ వైభవం ప్రాభవం కూడా తగ్గిపోతాయని అంటున్నారు. అమెరికా తన కళ్ళతో తానే పొడుచుకున్నట్లుగా ఈ పరిణామాలు ఉన్నాయని అంటున్నారు. ఎంతో నమ్మకమైన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ ని అమెరికా దూరం చేసుకోవడం వల్ల జరిగే పరిణామాలను భవిష్యత్తు నిర్ణయిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News