• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భార్యకు ప్రియుడితో పెళ్లి...

భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.. ట్విస్టు ఏమంటే?

| అప్పుడెప్పుడో వచ్చిన ఒక తెలుగు సినిమా. భార్యకు పూర్వరంగంలో ఉన్న బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి చేస్తాడు భర్త.

By - Tupaki Desk
Update: 2025-03-28 04:57 GMT

అప్పుడెప్పుడో వచ్చిన ఒక తెలుగు సినిమా. భార్యకు పూర్వరంగంలో ఉన్న బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి చేస్తాడు భర్త. అప్పట్లో ఆ మూవీ తెగ సంచలనంగా మారింది. వాణిజ్య పరంగా అంత విజయవంతంగా కానప్పటికి పెద్ద చర్చకు మాత్రం తెర తీసింది. భార్య ఇష్టాల్ని ఎంత గౌరవిస్తే మాత్రం.. ఆమె ప్రియుడికిచ్చి పెళ్లి చేయటమా? అన్నదో ప్రశ్న అప్పట్లో తెర మీదకు వచ్చింది. నిజానికి అప్పట్లో ఆ కాన్సెప్టును జీర్ణించుకోవటం సాధ్యం కాలేదు.

గడిచిన రెండు దశాబ్దాల్లో వచ్చిన మార్పులతో ఇలాంటివి సినిమాల్లో మాత్రమే కాదు నిజ జీవితంలోనూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండే పరిస్థితి. ఈ మధ్యన ఇలాంటి విషయాల్లో జీవిత భాగస్వామి చేస్తున్న దారుణాలు ఎక్కువ అవుతున్నాయి. పెళ్లై.. పిల్లలు వచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఒకరిపై ప్రేమ కలగటం.. అతడితో జీవితాంతం కలిసి బతికేందుకు భర్తను.. పిల్లల్ని బలి పెడుతున్న మహిళలు ఎక్కువ అవుతున్నాయి.

ఈ మధ్యనే తెర మీదకు వచ్చిన ముస్కాన్ ఉదంతం గురించి తెలిసిందే. నేవీ మర్చంట్ అధికారి అయిన సౌరభ్ రాజ్ పుత్ భార్య ముస్తాన్ కు సాహిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటం.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అడ్డుగా ఉన్న సౌరభ్ ను వదిలించుకునేందుకు అతడ్ని దారుణంగా హతమార్చిన వైనం ఆలస్యంగా వెలుగురావటం.. ఈ హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఆ దారుణ క్రైంను ఇక్కడ కట్ చేసి.. మన వార్తలోకి వస్తే ఉత్తరప్రదేశ్ లోని బబ్లూ.. రాధికలకు 2017లో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి కోసం వేరే రాష్ట్రానికి వెళ్లి కూలిపనులు చేస్తుంటాడు బబ్లూ. ఇదిలా ఉంటే.. రాధికకు విశాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన బబ్లూ.. రాధికను నిలదీశాడు. ప్రియుడ్ని వదులుకోవాలని చెప్పాడు. అందుకు ఆమె నో చెప్పింది.

ఈ సమయంలోనే ముస్కాన్ ఉదంతం తెర మీదకు రావటం.. బబ్లూ సన్నిహితుల సూచన అతడి మీద పని చేసింది. దీంతో.. తన భార్యకు.. ఆమె ప్రియుడితో పెళ్లి చేయించాడు. తానే దగ్గర ఉండి ఒక ఒప్పంద పత్రాన్ని రాయించాడు. గ్రామస్థుల సమక్షంలో పెళ్లి చేశాడు. మేరఠ్ ఉదంతం గురించి విన్న తర్వాత అందరు ప్రశాంతంగా బతకాలన్న ఉద్దేశంతోనే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పాడు. ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతను బబ్లూనే తీసుకోవటం గమనార్హం. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.


संत कबीरनगर मे पत्नि राधिका व उसके प्रेमी की शादी करा कल्लू ने 12 साल के रिश्ते को तिलान्जलि दी। विवाह सम्पन्न होने के बाद राधिका रोते दिखी।
बेचारा पति अपनी जान की खैर मना रहा है। राधिका अपने दोनों बच्चे एक्स के घर ही छोड़ गई।#ViralVideos https://t.co/FAlNqo40Jy pic.twitter.com/FYA28WRJUt

— TRUE STORY (@TrueStoryUP) March 26, 2025


Tags:    
  • BetrayalInLove 
  • TrustIssues 
  • Relationship 
  • MarriageProblems 
  • UttarpradeshCouple 
  • MarriedCouple 

Similar News

రాప్తాడు బాలిక ఆరోగ్యంలో కీలక మార్పు.. ప్రాణాపాయం దాటినట్లే!

2026-11-10 09:39 GMT

ఒక ఎఫైర్ ఖరీదు అక్షరాల రూ.18 లక్షల కోట్ల నష్టం..

2026-11-10 09:37 GMT

10 రోజుల ఉత్కంఠ.. 19న జడ్పీ, మండల పరిషత్ చైర్మన్ల ఎన్నిక

2026-11-10 09:36 GMT

పవన్ కోసం.. టీడీపీ, వైసీపీ ఒకే మాట!

2026-11-10 09:36 GMT

ఆ వార్తలు ఓవైపు.. ప్రజా నాయకుడిగా పవన్ ఇలా!

2026-11-10 09:31 GMT

అనంతపురంలో మేయర్ రచ్చ : టీడీపీ ఎమ్మెల్యేలకు అనంత వెంకటరామిరెడ్డి బిగ్ సవాల్

2026-11-10 09:27 GMT

కనీసం నా కళ్లలోకి కూడా చూడడు.. మోడీపై సోనియా హాట్ కామెంట్స్

2026-11-10 07:52 GMT

అమెరికాలో ఎస్‌బీఐ విస్తరణ.. టెక్సాస్‌లో కొత్త బ్రాంచ్ ప్రారంభం!

2026-11-10 07:15 GMT

న్యూజెర్సీలో దీపావళి వేడుకల తర్వాత చెత్తకుప్పలు.. పండుగ సంబరాల్లో పౌర బాధ్యత మరిచారా?

2026-11-10 07:15 GMT

పవన్ విడాకులు.. ప్రత్యర్థులకు ఎలాంటి కౌంటర్ ఇస్తారు!

2026-11-10 06:53 GMT

కార్తీక మాసంలో శాకాహారమే ఎందుకు తినాలి?

2026-11-10 06:42 GMT

ఇరాన్ పై యుద్ధం ఆపేశాడు.. వెనక్కి తగ్గేశాడు.. ట్రంప్‌కు ఇప్పటికైనా జ్ఞానోదయం అయిందా?

2026-11-10 06:39 GMT

Copyright @2026

Powered by Blink CMS