వైసీపీలో మరో వికెట్... జనసేనలో చిత్తూరు ఎమ్మెల్యే!

ఇందులో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

Update: 2024-03-07 12:28 GMT

ఏపీలోని అధికార వైసీపీలో పార్టీని వీడుతున్న వారి సంఖ్యలో మరో అంకె పెరిగింది. పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేపట్టిన నేపథ్యంలో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరగా.. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే జనసేనలో చేరారు. దీంతో... వైసీపీలో మరో వికెట్ పడినట్లయ్యింది. ఇందులో భాగంగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

అవును.. ముందుగా ప్రకటించినట్లుగానే చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు.. జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆరణి శ్రీనివాసులు... గత నాలుగైదేళ్లుగ వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు.సీమలో గెలిచిన ఒకే ఒక్క బలిజ ఎమ్మెల్యే అయిన తనకు టిక్కెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు!

ఇదే సమయంలో పార్టీ సిద్ధాంతాలు నచ్చడంతోనే జనసేనలో చేరినట్లు తెలిపిన శ్రీనివాసులు... చిత్తూరులో జనసేన కార్యకర్తల ఇళ్లను జగన్ సర్కార్ కూల్చివేస్తుందని ఆరోపించారు. అనంతరం మైకందుకున్న పవన్... చిత్తూరు జిల్లా పూర్తిగా ఒక కుటుంబం చేతిలో ఉండిపోయిందని.. రాయలసీమ ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో చిక్కుకుందని అన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఇంకేమీ మిగలదని తెలిపారు.

Read more!

చిత్తూరు టికెట్‌ ఇస్తానని మోసం చేశారు!:

గురువారం జనసేనలో చేరిన శ్రీనివాసులు... బుధవారం ఏప్రాటు చేసిన మీడియా సమక్షంలోనే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా వైసీపీ పైనా, జగన్ పైనా విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా వైసీపీలో కాపులకు జరుగుతున్న వివక్ష అంతా ఇంతా కాదని, అది చూసి విసిగిపోయి తాను బయటకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో... వైసీపీలో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచీ అంకితభావంతో పనిచేసినట్లు తెలిపిన ఆయన.. "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో చిత్తురూను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపినట్లు తెలిపారు. ఇలా పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన తనకు 2024 ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా జగన్ మోసం చేశారని ఆరోపించారు. ఇదే క్రమంలో ఏపీఐఐసీ ఛైర్మన్ పొస్టు ఇస్తామని చెప్పి మోసం చేశారని తెలిపారు.

Tags:    

Similar News