లిక్కర్ స్కాం లో మిధున్ రెడ్డి అరెస్ట్

ఏపీలో లిక్కర్ స్కాం మీద దర్యాప్తు జరుపుతున్న సిట్ ఈ రోజు విచారణ అనంతరం వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని అరెస్ట్ చేసింది.;

Update: 2025-07-19 16:20 GMT

ఏపీలో లిక్కర్ స్కాం మీద దర్యాప్తు జరుపుతున్న సిట్ ఈ రోజు విచారణ అనంతరం వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని అరెస్ట్ చేసింది. మిధున్ రెడ్డి ని విచారణకు పిలిచి దాదాపుగా ఏడు గంటల పాటు దర్యాప్తు చేసింది. అనంతరం రాత్రి పొద్దుపోయాక ఆయనను అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించింది. మిధున్ రెడ్డి అరెస్టుని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మిధున్ రెడ్డికి ఆదివారం కోర్టులో హాజరు పరచనున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో దాదాపుగా 3,500 కోట్ల రూపాయల మేర లిక్కర్ స్కాం జరిగిందని సిట్ అంటోంది. దానికి సంబంధించి అనేక ఆధారాలను సేకరించింది అని చెబుతున్నారు. ఇక లిక్కర్ స్కాం లో కొన్ని మొత్తాలు మిధున్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళినట్లుగా సిట్ ఆధారసహితంగా ఆయన ముందు వివరాలను ఉంచినట్లుగా చెబుతున్నారు. మిధున్ రెడ్డికి చెందిన కంపెనీలలోకి ఈ మొత్తాలు వెళ్ళాయని సిట్ పేర్కొంటోంది.

మరో వైపు చూస్తే లిక్కర్ స్కాం కేసులో ఏ 4గా మిధున్ రెడ్డిని సిట్ పేర్కొంది. మరో వైపు ఈ కేసుకు సంబంధించి గత సెప్టెంబర్ లో ఏర్పాటు అయిన సిట్ కొన్ని నెలలుగా లోతుగా విచారణ జరుపుతోంది. ఈ కేసులో చాలా మందిని అరెస్టు చేశారు.

మిధున్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆ మీదట ఆయన ఢిల్లీ నుంచి ఈ రోజున ఉదయం విజయవాడ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ఏసీబీ కోర్టు మిధున్ రెడ్డి అరెస్టునకు అనుమతి నిరాకరించింది అని అంటున్నారు. అయినా సరే మిధున్ రెడ్డిని అరెస్ట్ సిట్ చేసింది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైసీపీలో కీలకంగా మిధున్ రెడ్డి ఉన్నారు. ఆయన లోక్ సభలో వైసీపీ పక్ష నేతగా కొనసాగుతున్నారు. ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా సిట్ విచారించింది. తాజాగా ఆయనను మరోసారి విచారించేందుకు సిట్ డేట్ ఫిక్స్ చేసినా ఆయన మరో రోజు వస్తాను అని తెలియచేశారు.

మిధున్ రెడ్డి అరెస్టు తో మరిన్ని అరెస్టులు సాగుతాయా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఒక ఎంపీ అరెస్టు అన్నది ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి ఈ అరెస్టు తరువాత ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. అయితే ఇది అంతర్జాతీయ కుంభకోణం అని ఈడీ కూడా జోక్యం చేసుకోవాలని ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News