• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లూలూ మాల్ లో నికృష్టుడు.....

లూలూ మాల్ లో నికృష్టుడు.. అమ్మాయిలూ ఈ వీడియో చూడండి!

| రద్దీగా ఉన్న మాల్ లోని గేమ్ జోన్ లోకి వెళ్లిన అతను.. ఏదో ధ్యాసలో ఉన్న ఒక యువతిని వెనుక నుంచి దారుణ రీతిలో టచ్ చేసి.. అదేమీ తెలీదన్నట్లుగా వెళ్లిన వైనం చూస్తే.. అతగాడి బరితెగింపు విస్మయానికి గురి చేయక మానదు.

By - Tupaki Desk
Update: 2023-10-31 04:33 GMT

సోషల్ మీడియాతో జరుగుతున్న నష్టం ఇంతా అంతా కాదంటూ కొందరు కిందామీదా పడుతుంటారు. కానీ.. కొన్ని సందర్భాల్లో మాత్రం.. సోషల్ మీడియా పుణ్యమా అని కొందరి నీచుల పైత్యాలు కళ్లకు కట్టినట్లుగా కళ్ల ముందు కనిపించే పరిస్థితి. తాజాగా వైరల్ గా మారిన ఒక చిట్టి వీడియో ఆ కోవకు చెందింది. లూలూ మాల్ లో ఒక పెద్ద వయస్కుడి నీచత్వం కళ్లకు కట్టినట్లుగా కనిపించటమే కాదు.. ఇలాంటోడ్ని ఎలాగైనా గుర్తించి.. తాట తీయాల్సిన అవసరం ఉందన్న భావన కలుగక మానదు.

కేవలం పదమూడు సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన తర్వాత.. బహిరంగ ప్రదేశాల్లోనూ.. రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ వీడియో నొక్కి చెబుతుందని చెప్పాలి. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. బెంగళూరులోని లూలూ మాల్ లో ఒక యువతిని వెనుక నుంచి ఒక పెద్ద వయస్కుడు కావాలని బ్యాడ్ గా టచ్ చేసిన వైనం కెమేరా కళ్లకు దొరికేసింది.

రద్దీగా ఉన్న మాల్ లోని గేమ్ జోన్ లోకి వెళ్లిన అతను.. ఏదో ధ్యాసలో ఉన్న ఒక యువతిని వెనుక నుంచి దారుణ రీతిలో టచ్ చేసి.. అదేమీ తెలీదన్నట్లుగా వెళ్లిన వైనం చూస్తే.. అతగాడి బరితెగింపు విస్మయానికి గురి చేయక మానదు. ఉద్దేశపూర్వకంగా ఉన్న ఇతడి నికృష్ట చేష్టకు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటనలో బాధితురాలు.. తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితిని గుర్తించినప్పటికి.. రెప్పపాటులో అతడు కవర్ చేస్తూ.. పక్కకు వెళ్లిన వైనం కనిపిస్తుంది.

ఈ వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేయటంతో ఈ నీచుడి దారుణ చేష్ట బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఈ వీడియోను పోస్టు చేసిన వారు ఏమని పోస్టు చేశారంటే.. ‘‘ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో లులు మాల్ ఫంచురా బెంగళూరులో ఈ వీడియోను రికార్డు చేశాం. వీడియోలో ఉన్న వ్యక్తి చుట్టుపక్కల ఉన్న బాలికలు.. మహిళలతో ఇలా ప్రవర్తిస్తున్నాడు. మొదట ఇతన్ని చూసినప్పుడు అతనిపై నాకు డౌట్ కలగింది. దీంతో.. వీడియో షూట్ చేస్తూనే అతన్ని ఫాలో అయ్యాను. అప్పుడు ఈ దారుణాన్ని గుర్తించాను. దీనిపై సెక్యూరిటీకి కంప్లైంట్ చేశాం. అతన్ని వెతికాం. అయితే.. అతను కనిపించలేదు. కాకుంటే.. ఆ వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకుంటామని భద్రతా సిబ్బంది హామీ ఇచ్చారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వ్యక్తులు ఇలా చేయటమా?’’ అంటూ పేర్కొన్నారు. సో.. అమ్మాయిలూ పారాహుషార్.

The video of a young woman being sexually harassed by an elderly man at a mall in #Bengaluru went viral on social media following which the #BengaluruPolice began a probe.

The video shows the accused man deliberately touching the back of the woman at the games zone in the… pic.twitter.com/eOSf3prNR8

— Hate Detector 🔍 (@HateDetectors) October 30, 2023
Tags:    
  • Lulumall 
  • Banglore 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS